అందరికి స్వాగతం.వినాయక చవితి సందర్భంగా అందరికి ముందుగా వినాయకచవితి శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా మనం వినాయకుని గ్రామం వెళ్ళొద్దాం.వినాయకుని గ్రామం ఎమిటి,ఎక్కడ ఉంది అంటే తమిళ్‌నాడులోని పిళ్ళయార్‌పట్టి యే ఆ గ్రామం.తమిళ్‌లో పిళ్ళయార్ అంటే వినాయకుడు.పట్టి అంటే గ్రామం.తమిళ్‌నాడులో శివునికి,ఆయన కుమారులకి ఉన్న ప్రాధాన్యం అందరికి తెలిసిందే.కాని తమిళ్‌నాడు మొత్తంలో అత్యంత ముఖ్యమైన వినాయకుని ఆలయం ఇది ఒక్కటే.
ఇది పుదుకొట్టైకి,కారైకూడి మధ్యన ఉంది.ఇక్కడ ఆరడుగుల ఎత్తుతో కూడిన రాతి విహ్రం అందరిని అలరిస్తుంది.గుడి ముందు కోనేరు,గుడిలో బంగారు తొడుగుతో వినాయకుడు,గుళ్ళో ఏనుగు తప్పక చూడాలి.గుడి చాల విశాలంగా భక్తి భావం పెంచేలాగ వుంటుంది.ఇక్కడ గోడపై ఉన్న వినాయకుని చిత్రాన్ని ఏ పక్కనుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లు చిత్రించారు.అది తప్పక చూడాలి.క్రీ.శ.400 నాటిదైన ఈ ఆలయం ఈ మధ్యనే కొత్త రంగులు దిద్దుకుంది.
గుడిలోపల ఒక మూల వినాయకుని వాహనమైన మూషికం విగ్రహం ఉంటుంది.అది ఒక మూల అంతగ కనిపించకుండా ఉండటం చేత అందరు చూడరు.ఆ మూషికం చెవిలో మన కోర్కెలు చెపితే అది గణనాధునికి చేరవేస్తుందని ప్రతీతి.
ఇక్కడి వెళ్ళాలంటే పుదుకొట్టై నుంచి ఐతే మధురై వెళ్ళే దారిలో తిరుపత్తూర్ దగ్గర దిగి అక్కడినుంచి కారైకూడి వెళ్ళే కొన్ని బస్సులు లేదా లోకల్ బస్సులు కొన్నిట్లో చేరుకోవచ్చు.కారైకూడి నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది.పుదుకొట్టై నుంచి ఐతే గంటన్నలో అక్కడికి చేరుకోవచ్చు.వినాయక చవితికి ఇక్కడ పదిరోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.ఇక్కడికి దగ్గరలో సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం కుండ్రకుడి ఉంది.అది పిళ్ళయార్‌పట్టి నుంచి 5 కి.మీ.ఉంటుంది.
నేనెప్పుడు పుదుకొట్టై వెళ్ళినా పిళ్ళయార్‌పట్టి వెళ్తుంటాను.అందరు తప్పక చూడవలసిన ప్రదేశం.ఒక్క తమిళ్‌నాడు నుంచే కాక కేరళ,కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు.మీకు చాన్స్ వస్తే తప్పక చూడండి.నేను ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను.
అదండి వినాయకుని గ్రామం విశేషాలు.ఆ గణపతి అందరికి ఆయురారోగ్యాలు,అష్టైస్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ విహారి.
13 comments:
మంచి క్షేత్రాన్ని కళ్ళతో చూసినట్లు ఆవిష్కరింపచేశారు.ధన్యవాదములు
చాలా మంచి సమాచారం ఇచ్చారు.
విహారి గారూ, వినాయక చవితి శుభాకాంక్షలు... అలానే మంచి క్షేత్రాన్ని పరిచయం చేసినందుకు నెనర్లు...
Thank you for the info.
విహారిగారు,
వినాయక చవితి శుభాకాంక్షలు..
మీకూ వినాయకచవితి శుభాకాంక్షలు.
Nice post vihari garu.
vihaari baavunnaaraa?
vinaayakuni graamam baavumdi.
అందరికి పేరు పేరునా నెనర్లు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు
విహారి గారు,
చాలా బాగుంది టపా! ఫొటోలు కూడాను!
vihari garu meeku vinayaka caviti subhaakankshalu, nice post.
చాల బాగుందండి. వివరణ కూడా బాగుంది.
చాలా బాగుంది టపా!ధన్యవాదములు
Post a Comment