Wednesday, November 28, 2007

మహబలిపురం



అందరికి నమస్కారం.మొన్న దసరాకి మా స్నేహితులు వస్తే మహబలిపురం వెళ్ళాం.ఆ విసేషాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం మమల్లాపురం.మమల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు.మహాబలిపురం చూడలేక పోతే జీవితంలో ఒక మంచి అనుభూతిని మిస్ అయ్యినట్లే.



చిన్నప్పుడు బళ్ళో చదువుతున్నప్పుడు మా పక్క ఊరి దియేటర్లో "బాలరాజు కధ" అనె సినిమా వస్తే పిల్లలికి తక్కువ ధర టికెట్తో సినిమాకి పంపించారు. ఆ సినిమాలో మొత్తం మహాబలిపురం అందాలు చూపిస్తారు.ఆ సినిమా చూసినప్పటినుంచి మహాబలిపురం చూడాలని ఆశ.అది ఇన్నళ్ళకి తీరింది.ఇప్పటికి ఆ సినిమాలోని "మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళా జగతికిది కొత్తగోపురం " అనే పాట అప్పుడప్పుడు హం చేస్తుంటాను.ఈ పాట పూర్తి లిరిక్స్ కోసం ఇక్కడ చూడండి.



మహాబలిపురానికి ఆ పేరు రావటానికి ఒక కధ వుంది.పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.తర్వాత పల్లవులకాలంలో ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది.పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు.అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద.పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు.దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.



ప్రతిరాయికి ఒక రూపం కల్పించి ఆ ప్రాంతం మొత్తాన్ని శిల్పసంపదకు చిరునామా చేసారు.అందుకే ఇది యునెస్కో వారి జాబితాలో చేరింది.

మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు వున్నాయి.అక్కడినుంచి ఒక గంటన్నర రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు.సముద్రం ఒడ్డున శిల్పకళా నగరం నిజంగా అద్భుతమైన అనుభూతి.మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలొనే వుంటాయి.ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు.తెలీదని ఆటో లేదా టాక్సి ఎక్కారో మోసపోయినట్ట్లే.ఎందుకంటే మేము అలాగే ఎక్కాంకాబట్టి.



మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.మొదటివి మండపాలు,గోపురాలు,లైట్ హౌస్ ,బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం.ఇవి చూడటానికి,ఫొటొలకి టికట్ లేదు.పూర్తిగా ఉచితం.



ఇది బిగ్ రాక్ .ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది.ఇది ఒక విచిత్రం.ఇక్కడ ఒక చెట్టు వుంది.ఆ చెట్టు కి కాసే కాయలు మన చేయ్యంత వుంటాయి.

రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు.ఇవి చూడటానికి , ఫొటోలకి టికట్ తీసుకోవాలి.




మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్.ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి.సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది.ఇది కూడా చాలా దగ్గరే.బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.



ఆ తరువాత బీచ్ లో సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు.గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు.వేడి వేడి సీఫుడ్ లాగించొచ్చు.ఇక్కడ భొజనం హోటళ్ళకి,లాడ్జిలకి కొరతే లేదు.కాని రాత్రుల్లు స్టే చేసేంత అనువైన ప్రాంతంకాదు. తిరిగి చెన్నై వచ్చేయటం బెటర్.భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ కనిపిస్తారు.




ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఎన్నో ఆలయాలతో అలరారిన ఈ ప్రాంతం తరువాత సముద్రపు కోతవల్ల అన్నో అపురూపమైన శిల్పాలని , ఆలయాలని కోల్పోయింది. సముద్రగర్భంలో కలిసిపోగా మిగిలనివి ఇప్పుడు మనలని అలరిస్తున్నాయి.ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ప్రాంతం మహాబలిపురం.ఆ అనుభూతిని మిస్ కాకండి.

మళ్ళి మరో ప్రాంత విశేషాలతో మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు.

Wednesday, November 14, 2007

సింగార చెన్నై

అందరికి నమస్కారం.



చెన్నై అందాలు చుసొద్దాం.అసియాలోని అతిపెద్ద బీచుల్లో ఒకటైన మెరీనా సాగరతీరం ఒకసారి చుట్టివద్దాం.చెన్నైలో కాలక్షేపానికి అందరూ చేరే ప్రాంతం మెరీనా బీచ్.ఎప్పుడు జనంతో కలకలలాడుతూ వుంటుంది.మీ అబిమాన తారలతో ఫోటో దిగాలనుకుంటున్నారా.వాళ్ళు రెడి మరి మీరు.




వేడి వేడి చేపల ఫ్రై తినాలని వుందా అవి కూడా రెడి మీదే ఆలస్యం.





ఇది మహానటుడు , మాజి ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ సమాధి.




ఇది మెరినా తీరంలోనే వుంది.ఇది కొంచం మన ఎన్.టి.ఆర్ సమాధిలాగే వుంటుంది.




మెరినా సంక్రాంతికి ఇసుకవేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతుంది.కట్టు పొంగల్,మాటు పొంగల్ అని రెండు రోజులు అక్కడ తీర్ధం జరిగినట్టే.

చెన్నై సెంట్రల్ రైల్వే నిలయం ఇదే.




ఇక ఇది కోయంబేడు బస్ టెర్మినస్.




ఆసియాలో అతి పెద్ద బస్ స్టాండ్ ఇదే.



ఇక్కడినుంచి తమిళనాడులోని అన్ని ప్రాంతాలతో పాటు కేరళ,అంధ్రాలోని కొన్ని ప్రాంతలకు బస్సులు వుంటాయి.



అవి సంగతులు.మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు.

Friday, November 9, 2007

అందరికి దీపావళి శుభాకాంక్షలు.

రూంలో నెట్ పనిచెయడం లేదు.నెట్ సెంటర్లో బొమ్మలు పెట్టడం కుదరటంలేదు.అందుకే బొమ్మలు లేకుండ శుభాకాంక్షలు చెప్తున్నను.అందరు ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తెఊ మీ విహారి.