Monday, August 27, 2007

పంచాక్షరి

అందరికి నమస్కారం.
పంచ అంటే అయిదు అని అందరికి తెలుసు."పంచ" అనే పదంతో మొదలైన కొన్ని పదాలు వాటి వివరాలు కొంత రీసర్చ్ చేసి సంపాదించాను.ఇందులో కొన్ని పదాలు వాటి గురించిన నాకు తెలియలేదు.దయచేసి పెద్దలు,తెలిసినవారు చెప్పగలరని ఆశిస్తున్నాను.అలాగే నేను రాసిన వాటిలొ తప్పులు వుంటే చెప్పగలరు.

ఇక అవి

1.పంచప్రాణలు--- ప్రాణ,అపాన,సమాన,వ్యాన,ఉదానములు.

2.పంచభూతాలు --- జలము(నీరు),అగ్ని(నిప్పు),ప్రుథ్వి(భూమి),ఆకాశం(నింగి),వాయువు(గాలి).


3.పంచామ్రుతం --- ఆవుపాలు,ఆవుపెరుగు,ఆవునెయ్యి,తేనె,పంచదార.

4.పంచలోహాలు --- బంగారం,వెండి,కంచు,రాగి,ఇత్తడి.

5.పంచేంద్రియాలు --- కళ్ళు,చెవులు,ముక్కు,నోరు,చర్మం.

6.పంచారామలు ---

సోమారామం(భీమవరం),
క్షీరారామం(పాలకొల్లు),
అమరారామం(అమరావతి),
కుమారరామం(సామర్లకోట),
ద్రాక్షారామం.


7.పంచభూతలింగాలు ---

శ్రీకాళహస్తీశ్వర స్వామి(వాయులింగం - కాళహస్తి),
నటరాజస్వామి (ఆకాశలింగం - చిదంబరం),
అరుణాచలేశ్వర స్వామి(అగ్నిలింగం - తిరువణ్ణామలై),
ఏకాంబరేశ్వరస్వామి (ప్రుథ్విలింగం - కాంచీపురం),
జంభుకేశ్వరస్వామి (జలలింగం - తిరువాణైకొవిల్(తిరుచ్చి))


8.పంచ నాట్యసభలు ---

[కనకసభ(గోల్డ్) - చిదంబరం],
[రజతసభ(సిల్వర్) - మదురై],
[తామ్రసభ(కాపర్) - తిరునల్వేలి],
[రత్నసభ(రూబి) - తిరువళంకాడు],
[చిత్రసభ(పిక్చర్) - కుట్రాలం].


9.పంచపాండవులు --- ధర్మరాజు,భీమసేనుడు,అర్జునుడు,నకులుడు,సహదేవుడు.

10.పంచముఖి రుద్రాక్ష --- అయిదు ముఖములు కల రుద్రాక్ష.

11.పంచపాత్ర --- పూజలలొ వాడే ఒక పాత్ర.

12.పంచవటి.

13.పంచాక్షరి మంత్రం.

పంచవటి యొక్క అర్దం తెలుపగలరు.
పంచాక్షరి మంత్రం తెలుపగలరు,అలాగే దాని అర్దం వివరించగలరు.


అందరికి ధన్యవాదాలు.
మీ విహారి.

Wednesday, August 22, 2007

అరుకులోయ --- నా జ్ఞాపకాలు 3

నమస్తే
అరుకులోయకి సంబందించిన వరుస పొస్టులలొ చివరిది ఇది.ఇంకా సాగదీసి మిమ్మల్ని బోర్ కొట్టించ దలుచుకోలేదు. అరుకులోయ అందాలగని.ఆ అందాలు చూడాలంటే ఏదొ వెళ్లివచ్చాం అన్నట్టు కాకుండా 3 ,4 రొజులు స్టే చేయగలిగితే అన్ని చూడవచ్చు.అలా కొండలలోకి ,అడవులలలోకి ట్రెకింగ్ చేస్తే ఈ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ పొందవచ్చు.బస్ స్టాండ్ కి అతి సమీపంలొ వున్న భూత్ బంగ్లా(ఇది గెస్ట్ హౌస్ ,అప్పుడు పాడు బడి వుండటం వల్ల దీన్ని అలా పిలిచేవారు.ఇప్పుడు ఆధునీకరించబడినది.బస్ స్టాండ్ నుంచి కనిపిస్తుంది.బస్ స్టాండ్ దాటి కొంచం ఎదరకు వెళితే వస్తుంది.ఇక్కడ రైలు స్టేషన్ లేకున్నా పర్యాటకుల విజ్ఞప్తి మేర స్టాప్ పెట్టడమైనది. ట్రైన్ అక్కడ ఆగుతుంది).
[ఈ పొస్ట్ లొని ఫొటొలు "ND TV" వారి వెబ్ సైట్ నుండి గ్రహించడమైనది.]అక్కడ పర్యాటక శాఖ వారు కొన్ని వింత బొమ్మలు పెట్టారు.ఈ కింది ఫొటొ లొ వున్నవి అవే.



ఇక్కడికి సాయంత్రాలు ఎక్కువమంది సేదతీరటానికి వస్తారు.



సుందరకాండ సినిమా లొ వెంకటేష్ కి అపర్ణ ప్రేమలేఖ ఇచ్చే సన్నివేశం ఇక్కడే చిత్రీకరించడమైనది.



ఇక ఈ చివరి ఫొటొ చూడంది.వెనక బేగ్రౌండ్ చూడండి.ఎంత అందంగా వుందో.ఆ వెనక నుంచే ట్రైన్ వెళుతుంది.అక్కడ ఏరు ఒకటి కనిపిస్తుంది కదా దానిని రాళ్ల గడ్డ అంటారు. ఇలాంటి గడ్డలు చాలా వుంటాయి.అలా ఆ గడ్డ దాటి ముందుకు వెళితే కొత్తవలస అనే ఊరు,నర్సరి వస్తాయి.ఇంకా ముందుకు వెళితే కొన్ని గిరిజన గ్రామలు వస్తాయి.



గిరిజన మహిళలు కుట్టుడాకులు(విస్తరాకులు)కుడుతూవుంతారు. ఒకసారి ఆ గ్రామంలొ ఒకావిడ ఇంట్లొ కూర్చుని కుట్టుడాకులు కుడుతూవుంది.ఇంతలొ తలుపు చప్పుడు అయ్యింది.ఎవరా అనుకునేంతలొ మళ్ళి ఎవరో తలుపు కొట్టారు.ఎవరా అని తలుపు తీసిన వెంటనే ఒక ఎలుగుబంటి లాగిపెట్టి చెంపమీద ఒక్కటి ఇచ్చింది.పాపం ఆవిడకు దెబ్బకి తోలు ఊడివచ్చిండి.దాంతొ పెద్దగా కేకలు పెట్టడంతొ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఎలుగుబంటి బయపడి పారిపోతూ నూతిలొ పడి చచ్చింది.దానిని బయటకు తీసి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లొ జనాలు చూడటం కోసం పెట్టారు.అప్పుడు మొదటిసారి ఎలుగుబంటి చూసాను.ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర చాల సినిమాలు తీసారు.ఉదా|| మౌనపోరాటం మొదలైనవి.

ఇక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలొ మూడు గుడులు వున్నాయి.వెంకటేశ్వర స్వామి,ఈశ్వరుడు,సాయిబాబా గుడులు.మొదటి రెండు సుమారు 40 నుంచి వున్నాయి.సాయిబాబా గుడి మాత్రం 10 సంవత్సరాల క్రితం కట్టబడింది.ప్రతి ఏటా వెంకటేశ్వర కళ్యాణం వైభవంగా జరుగుతుంది.

అరుకు ఎంట్రన్స్ లొ ఒక ప్రైవేట్ పాఠశాల వుంటుంది(దాని పేరు....ఆ అల్లూరి సీతారామరాజు పాఠశాల అనుకుంట).సుందరకాండ సినిమా చాలా భాగం అక్కడే తీశారు.ఇక ఇక్కడికి సమీపంలొ మాడుగుల అనే ఊరు వుంది.అక్కడ దొరికే హల్వా రుచి అమోఘం.ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.పట్టుపురుగుల పరిశ్రమ,మల్బరి తోటలు ఇప్పుడు వున్నయొ లేదొ తెలీదు.మా చిన్నపటి నుంచి ఇప్పటివరకు వున్నది ఒకటే థియేటర్.దాని పేరు జ్యోతి.సినిమా మారినప్పుడల్లా రిక్షాలొ నేడే చుడండి బాబు .ఆలసించిన అశాభంగం అంటూ చెబుతుంటే మేము బండి వెనకాల పరుగుపెట్టేవాళ్లం.

అవండి అరుకు సంగతులు,నా జ్ఞపకాలు.
మిమ్మల్ని బాగా బోర్ కొట్టించానా.
మళ్లి కొత్త విశేషాలతొ ఈ "కొత్తబంగారులోకం" లొ కలుస్తాను.
అంతవరుకు శెలవు.
అందరికి ధన్యవాదాలు.
మీ విహారి

Tuesday, August 21, 2007

రాజీవ్ మేనియా

దేశానికి రాజీవ్ మేనియా పట్టుకున్నట్టువుంది.ఇదొ పెద్ద అంటువ్యాధిలా అందరికి పాకేస్తుంది.ఇప్పటిదాక అంధ్రాకే అనుకుంటే ఇప్పుడు చెన్నైకి కూడా ఆ రొగం అంటుకుంది.చెన్నై నుంచి మహాబలిపురం వెళ్లే ఒల్ద్ మహాబలిపురం రోడ్ ఇప్పుడు "రాజీవ్ రహదారి"గా పేరు మార్చుకుంది.ఇది ఇలాగే సాగితే దేశానికే రాజీవ్ దేశం అని పేరు పెట్టినా అశ్చర్యపోవక్కరలేదు.ఇంక లాలు వంతు మిగిలింది.ఆ ట్రైన్స్ కి కుదా రాజీవ్ ఎక్స్ ప్రెస్,ఇందిర మెయిల్ అని పెడితే సరి.


ఈ కార్టూన్ చూడండి.


హే భగవాన్

Monday, August 20, 2007

అరుకులోయ --- ట్రైబల్ మ్యూజియం

అందరికి నమస్కారం.
ఊరు వెళ్లటం వల్ల కొత్త పొస్ట్ లు లేక నా బ్లాగు కళ తప్పినట్లుంది.అందుకే కొత్త పొస్ట్ తొ మీ ముందుకు వచ్చా.అరుకులోయ గురించిన వరుస పొస్ట్ లొ అఖరి రెంటి లొ ఇది ఒకటి.
ఈ సారి అరుకులోయ లొని ట్రైబల్ మ్యూజియం చూసి వద్దాం రండి.అరుకులోయ లొని బస్ స్టాండ్ చెంతనే వున్న ఈ మ్యూజియం గిరిజనుల సాంప్రదాయలు,ఆచారాలు,అలవాట్లు,కట్టుబొట్టు,వాళ్లు ఉపయోగించే సామనులు, పనిముట్లు,వేటకి వాడే ఆయుధాలు సమస్తం ఇక్కడ కొలువుతీరివుంటాయి.లోనికి కెమెరా ఎలౌ చేయరు.కనుక ND Tv వెబ్ సైట్లొ సంగ్రహించిన ఫొటొలు పెట్టడమైనది.
మొదటిది మ్యూజియం ప్రవేశ ద్వారం.


లొపల అచ్చం మనుషులని పొలిన రూపాలతొ బొమ్మలు వుంటాయి.ఎమరపాటుగా చుస్తే నిజం మనుషులని అనుకుంటాం. అంత సహజంగా బొమ్మలు తీర్చిదిద్దారు.



మొత్తం మ్యూజియం రెండు అంతస్తుల్లొ వుంటుంది.వాళ్లు పనులు చేస్తున్నట్లు,వేటాడుతున్నట్లు,రకరకాల రూపాలలొ అవి వుంటాయి.



ఈ మ్యూజియం చూస్తే గిరిజనుల అలవాట్లు,జీవనవిధానం గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది.మ్యూజియంలొ గిరిజనులు తయారు చేసిన వస్తువులు అమ్ముతారు.



మ్యూజియంలొ వెనకాల చిన్న క్రుత్రిమ సరొవరం (లేక్) ఉంది.సాయంత్రాలు అందులొ బోటింగ్ చేసి సేదతీరవచ్చు.
అదండి అరుకులోయ ఆఖరి పొస్ట్ తొ మళ్ళి కలుస్తాను. అంతవరుకు సెలవు
మీ విహారి

Saturday, August 11, 2007

అరుకులోయ --- బొర్రా గుహలు

అందరికి నమస్కారం.
అతి పురాతనమైన బొర్రా గుహలు చూసి వద్దాం రండి.
ట్రైన్ లొ అరుకు వెళుతుంటే బొర్రా స్టేషన్ వస్తుంది.
అక్కడ దిగితే నడిచి గుహలు దగ్గరికి వెళ్లవచ్చు.లేదంటే అక్కడ చాలా ఆటొలు,జీపులు వుంటాయి.అవి ఎక్కి వెళ్లవచ్చు.
ఇక్కడె గోస్తనీ నది ప్రవహిస్తుంది చూడవచ్చు.అది మంచి సీనరి.బయట ఎంత వెచ్చగా వున్నా గుహ లొపలకి వెళ్ళగానే చల్లగా వుంతుంది. ఎన్నొ వేలకు పూర్వమే ఈ గుహలు ఏర్పడ్డట్టు చెబుతారు.ఈ గుహలనుంచి కాశికి దారి వుందని అంటారు.అది ఎంత నిజమొ తెలీదు. పై నుంచి చుక్కలు చుక్కలుగా నీరు కారుతూ వుంటుంది.ఆ నీరే గడ్డ కట్టి రాళ్ల కింద రూపాంతరం చెందాయి.ఆ రాళ్లు వివిధ దేవతలు ,బొమ్మలుగా ఏర్పడ్డాయి.అవి మనం కనిపెట్టడం కష్టం.అక్కడ గైడులు వుంటారు .వాళ్లని నియమించుకుంటే వాళ్లు మొత్తం టార్చ్లైట్ వేసి చుపిస్తూ వివరిస్తారు.కానీ లొపల కొన్ని చొట్ల గబ్బిలాలు వాసన వస్తుంది.లొపల చాలా జాగర్తగా చుసుకొని నడవాలి.మా చిన్నప్పుడు లైట్ లు వుండేవి కావు.అంతా చీకటిగా వుండేది. గైడులు కాగడాలు పట్టుకొని చూపించేవారు.ఏ మాత్రం కాలు జారినా అంతే.ఇప్పుడు లైట్లు పెట్టారు.కనుక ఏ భయం లేకుండ నిరభ్యంతరంగ వెళ్ళిరావచ్చు.

మొదటి ఫొటొ చూసార అది ముఖ ద్వారం .



ఇక రెండొ ఫొటొ గుహలొపలికి వెళ్ళే ద్వారము.



ఇక ఈ మూడొ ఫొటొ చూసారా.దీనికి ఒక కధ వుంది.కాని నాకు ఆ కధ గుర్తు లేదు.ఆవు దూడ పైనుంచి పడటం వల్ల అది ఏర్పడిందంటారు.


ఇక్కడ సినిమా షూటింగ్ లు జరుగుతాయి.జగదేకవీరుడు - అతిలోక సుందరి సినిమాలొ మొదటి పాట(మేరా నాం రాజు )మరియు శివ మూవీ లొ ఒక సాంగు ఉదాహరణలు.

వేళలు:
ఉదయం 10 నుంచి మధ్యానం 1 వరకు తిరిగి 2 నుంచి 5.30 వరకు.

అక్కడ హొటెల్స్,షాపులు వుంటాయి భొజనానికి,నీటికి ఇబ్బంది వుండదు.

అదండి
మళ్ళి కలుస్తాను
అంత వరకు సెలవు
మీ
విహారి
ఫొటొలు గొ టు ఇండియా వారి సౌజన్యంతొ

ఆరుకులోయ --- ప్రయాణం

అరుకు వెళ్ళలంటే రెండు మార్గాలు వున్నాయి.
ఒకటి రైలు ,రెండు బస్ ప్రయణం.
అన్ని అందాలు కవర్ చెయ్యాలంటే వెళ్లేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది.


ట్రైన్ వైజాగ్ లొ ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి.అది అలా కొండల ,లొయలు,గుహలు దాటుకుంటు సాగిపొతుంది.ప్రయణం సుమారు 5 గంటలు వుంటుంది.ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము.ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది.అది ఇండియా లొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు.


ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి.అక్కడ దిగి బొర్రా గుహలు చుసుకొని అరుకు వెల్లవచ్చు.లేదంటే తిరుగు ప్రయాణం లొ చుడవచ్చు.
అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జులు,గెస్ట్ హౌస్లు,కాటెజ్ లు వుంటాయి .

ప్రభుత్వ పున్నమి రిసార్ట్స్


సాంప్రదాయ కాటేజ్ లు


ఇక చూడవలసిన ప్రదేశాలు
1.బొర్రా గుహలు
2.పద్మాఫురం గార్డెన్స్
3.ట్రైబల్ మ్యూజియం
4.చాపరాయి
5.మత్స్య గుండం
6.తైద జింగెల్ బెల్స్
ఇవి ముఖ్యమైనవి .ఇవి కాకుండ చుట్టు పక్కల చిన్న ,చిన్నవి కొన్ని వున్నాయి.

ప్రయాణానికి అనువైన సమయం

మొత్తం సవత్సరం లొ ఎప్పుడైన వెళ్ళవచ్చు .
వేసవిలొ వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకొవొచ్చు .
శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్ని పసుపు వర్ణం తొ అందంగా తయారవుతాయి.అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి.


ఇక వర్షాకాలం ఐతే పచ్చదనం తొ కళకళలాడిపొతుంది.అప్పుడు వెళ్ళేవాళ్ళు రైన్ కోట్లు,గొడుగులు పట్టికెళ్ళటం మంచిది.
షాపింగ్:
గిరిజనులు తయారు చేసే వస్తువులు అవి అమ్ముతారు .
గిరిజనాబివ్రుధి సమస్థ అమ్మే స్వచ్చమైన తేనె మోదలైనవి కొనవచ్చు.

తిరుగు ప్రయణం:
బస్ జర్ని మంచిది.లేదంటే ఒక జీప్ మట్లదుకుంటే అన్ని చూడవచ్చు. వచ్చే దారిలొ తైద లొ జింగెల్ బెల్స్,కాఫి ప్లాంటెషన్స్ లాంటివి చూడవచ్చు .

ఫొటొలు గొ2ఇండియా,విసాఖ.ఆర్గ్ వారి సౌజన్యంతొ

మళ్ళి కలుస్తానండి
మీ విహారి

Friday, August 10, 2007

అరుకులోయ -- గిరిజనులు

ఎంటో నండి నాకు చేతులు ఆగటం లేదు.
ఎప్పుడెప్పుడు కొత్త పొస్ట్ వేసేద్దామ అని అనిపిస్తుంది.
ఈ పొస్ట్ అరుకులొ వుండే గిరిజనులు గురించి.
మొదటి ఫొటొ చూసార అవి వాళ్ళు వుండే ఇల్లు.
అరుకు వెళుతుంటే మీకు అక్కడక్క లొయల్లొ విసిరేసినట్లు వుంటాయి.



ఇక ఈ రెండొ ఫొటొ ఇది చాలా ఫేమస్.దిన్నే "దింస" అంటారు.అరుకులొ చలికి తట్టుకొవటానికి దీనిని కనిపెట్టినట్టు చెబుతారు.ఇలా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని మంట చుట్టు తిరుగుతుంటే వెచ్చగా వుంటుందని అంటారు.అలా తిరుగుతూ పాటలు పాడుతు డాన్స్ చేస్తుంటారు.అప్పుడప్పుడు అధికారుల కోసం,పర్యాటకుల కోసం కూడా ఇలా "దింస" డాన్స్ చేస్తుంటారు. వాళ్ళ చీర కట్టు చూసారా.అదొ స్పెషల్ .



ఇది ఇంకొ గిరిజన మహిళ ఫొటొ.



మళ్ళి తరువాతి పొస్ట్ లొ కలుసుకుందాం.
మీ
విహారి

అరుకులోయ --- శుక్రవారం సంత

అరుకులోయలొ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది.
చుట్టుపక్కల గిరిజన గ్రామాలలొ వుండే గిరిజనులు వాళ్ళు సేకరించిన వస్తువులు,పండించిన కురలతొ సంతకు వస్తారు. వాళ్ళు తయారు చేసిన కళాక్రుతులు,వెదురు సామానులు మొదలైనవి తెచ్చి అక్కడ అమ్ముతారు.కొన్ని ఫొటొస్ ఉదాహరణకి.


వాళ్ళు సరుకులు,కూరగాయలు అవి తేవటానికి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రత్యేక బస్సు సర్విస్ నడుపుతుంది. మొత్తం బస్సు అంతా సామనులు,జనాలతొ నిండిపోతుంది. పైన టాప్ కూడ ఖాళివుండనంతగా.



అదండి
మళ్ళి కొత్త పొస్ట్ తొ కలుస్త
వుంటానండి
మీ విహారి

Thursday, August 9, 2007

అరుకులోయ --- అందాలు 2

నమస్తే అండి.
పద్మాపురం గార్దెన్ లొని మరికొన్ని అందమైన ఫొటొలు.



ఈ రెండొ ఫొటొ చూసారా ఇందులొ కుందేల్లు, చిలుకలు పెంచుతారు.




ఇవి పనసచెట్లు(జాక్ ఫ్రూట్). మా చిన్నప్పుడు ఒక పనసపండు 2 రూపాయలు వుండేది. ఇప్పుడు ఒక తొన 2 రూపాయలు చెన్నై లొ. ఏమి చేస్తాం ఐనా తప్పదుగ ఆ వాసన తగలగానే తినాలనిపిస్తుంది.






Wednesday, August 8, 2007

అరుకులోయ --- అందాలు 1

నమస్తే అండి.
మళ్ళి కొత్త పొస్ట్ తొ మీ ముందుకు వచ్చా.
అరుకులొ చుడవలసిన ప్రదేశాలలొ ఇది ఒకటి.
ఇదే పద్మాపురం గార్డెన్స్.
మొదటి ఫొటొలొ వున్నది ప్రవేశద్వారం


ఆ బొమ్మ చెయ్యి చుసారా.అందులొ గ్లొబ్ వుండేది ఇప్పుడు ఎమయిందొ.
ఈ గార్డెన్లొ అనేక రంగుల రోజా పూలు పెంచుతారు.
ఇదివరకు ఈ గార్డెన్లొ లిచీస్ పళ్లు వుండేవి.దొంగతనంగా కోసుకు తినేవాళ్ళం. ఇప్పుడు అవి లేవు.


ఇవే నండి లిచిస్ .
ఇక కింద ఫొటొ లొ వున్నవి ట్రీ హౌసెస్ అద్దెకు ఇస్తారు.




ఇది ఇంకొ ఫొటొ


ఇంతే కాదండి ఇంకా చాలా రకాల పూలు,పళ్ళ చెట్ట్లు వున్నాయి.ఈ గార్డెన్ మధ్యలొ పిల్లల కొసం ఒక పార్క్ కూడా వుంది.
ఈ గార్డెన్ కి దగ్గరలొ రంజెల్డా వాటెర్ ఫాల్స్ వుంది.ఇది వరకు ఎప్పుడు నీటితొ వుండేది.ఇప్పుడు వర్షాకాలం మాత్రమే వుంటుంది.

అదండి సంగతి
మళ్ళి కలుస్తానండి.
మీ విహారి

Monday, August 6, 2007

అరుకులోయ --- నా జ్ఞాపకాలు 2

లేడిబాస్ మా ఊరొచ్చింది.

అవునండి లేడిబాస్ విజయశాంతి మా ఊరొచ్చింది.

అదేమైనా పెద్ద విషయమా అని మీరు అనుకొవొచ్చు.మా చిన్నప్పుడు మాకది విషయమే.

ఒకసారి సమ్మర్ కి అరుకువెళ్ళాం.ఒకరొజు అడుకుంటున్నాం.ఒక పక్కగా ఇనపవూసలుతొ పోత పొసిన సిమెంటు దిమ్మలు వున్నాయి.నేను అడుకుంటు వాటిమీద నడుస్తుంటే ఒక వూస నా కాలిలొ దిగిపొయింది.చెప్పులు వేసుకున్నా గాని చెప్పుముక్కతొ సహ దిగింది.ఇంట్లొ చెపితే తిడతారని చెప్పలేదు.దానితొ అది సెప్టిక్ అయ్యి చీము పట్టింది.ఇంక నా భాద చుడాలి.హస్పిటల్ వెళ్ళాలంటే పైకి కొంచం కొండ లాగ వుంటుంది.అది ఎక్కాలి. రోజు కుంటుకుంటు వెళ్ళిరావాలంటే తలప్రాణం తొకకి వచ్చేది.అయినా తప్పదుగా.

అరుకులొ సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతాయి అది అందరికి తెలుసు.ను కాలితొ బాదపడుతున్నప్పుడే లేడిబాస్ సినిమా వాళ్ళు వచ్చారు.విషయం ఎంటంటే ఆ సినిమాలొ నటించటానికి కొంతమంది పిల్లలు కావాలన్నారు.మా ఫ్రెండ్స్,మా అన్నయ్య అందరు పొలోమంటు వెల్లిపొయారు.నెను వెల్దామంటే నా కాలు భాద.ఏమిచేస్తాం రొజంతా ఏడుస్తు కుర్చున్నా.

సాయంత్రం వాళ్ళు మొఖాలు వేలడేసుకొని వచ్చారు.తీరా విషయం ఎంటంటే పొద్దున్న వాళ్ళు షూటింగుకి వెల్లగానే పులిహోర,దద్దొజనం పెట్టారంట. అబ్బ బాగుంది ఇలాగే అన్ని పెడతారు కద అనుకున్నారంట.షుటింగు ట్రైన్లొ లెండి.పొద్దున్ననుంచి ట్రైన్ లొ అటుఇటూ తిప్పుతూ,పరుగులుపెట్టించారంట. తీరా చూస్తే సాయంత్రం అయిన ఎమి పెట్టకుండ పంపారంట.ఆ సంగతి విని నా ఫేస్ అనందంతొ వెలిగిపొయింది..అమ్మయ్య బతికనురా భగవంతుడా అనుకున్నా.

అదండి సంగతి మళ్ళి కలుస్తా.
నమస్కారం.
మీ విహారి.

Thursday, August 2, 2007

అరకులోయ --- నా జ్ఞాపకాలు 1

పచ్చని కొండలు,గల గలా పారే సెలయేర్లు, పై నుంచి దూకే జలపాతాలు, చల్లని గాలిఅదే మా అందాల అరకులోయ.


నేను పుట్టింది అక్కడే.అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు.
పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరిలొ.వేసవి వస్తే చాలు అరుకు ప్రయాణం.
అప్పుడు చాలా చల్లగా వుండేది. ఇప్పుడుకూడా పరవాలేదు చల్లగానే వుంటుంది.
అక్కడ సిల్వెర్ చెట్లు ఎక్కువ వుండేవి.పొద్దున్నే రెడి అయ్యి వేటకి బయలుదేరే వాళ్ళం.
వేట అంటే ఏంటొ అనుకొనేరు చెట్టు నుంచి రాలే విత్తనాలు ఏరటానికి.
డబ్బా నిండ విత్తనాలు ఏరి షాప్ లొ ఇస్తే వాడు దొసిట్లొ ఈతపళ్ళు ఇచ్చేవాడు.
ఈతపళ్ళు అంటే ఇక్కడ దొరికేవి కాదు అవి నల్లగా,మంచి తియ్యగా వుండేవి.
లేదంటే డబ్బులు ఇచ్చేవాడు.అవి చూస్తే ఏదో సాధించేసామనే అనందం.
ఆ విత్తనాలు వాళ్ళు ఏమి చేసుకుంటారు అంటే ప్రభుత్వ విత్తన కంపెని లొ అమ్మేవాళ్ళు.
ప్రభుత్వం కొండల మీద అడవులు పెంచటానికి చల్లేది.
పగలంతా అటలు,విత్తనాలు ఏరటం,తిరగటం సమ్మర్ ఇట్టే గడిచిపోయేది.

అదండి మరికొన్ని సంగతులతొ మళ్ళీ కలుస్తాను.
మీ విహారి