Monday, August 27, 2007

పంచాక్షరి

అందరికి నమస్కారం.
పంచ అంటే అయిదు అని అందరికి తెలుసు."పంచ" అనే పదంతో మొదలైన కొన్ని పదాలు వాటి వివరాలు కొంత రీసర్చ్ చేసి సంపాదించాను.ఇందులో కొన్ని పదాలు వాటి గురించిన నాకు తెలియలేదు.దయచేసి పెద్దలు,తెలిసినవారు చెప్పగలరని ఆశిస్తున్నాను.అలాగే నేను రాసిన వాటిలొ తప్పులు వుంటే చెప్పగలరు.

ఇక అవి

1.పంచప్రాణలు--- ప్రాణ,అపాన,సమాన,వ్యాన,ఉదానములు.

2.పంచభూతాలు --- జలము(నీరు),అగ్ని(నిప్పు),ప్రుథ్వి(భూమి),ఆకాశం(నింగి),వాయువు(గాలి).


3.పంచామ్రుతం --- ఆవుపాలు,ఆవుపెరుగు,ఆవునెయ్యి,తేనె,పంచదార.

4.పంచలోహాలు --- బంగారం,వెండి,కంచు,రాగి,ఇత్తడి.

5.పంచేంద్రియాలు --- కళ్ళు,చెవులు,ముక్కు,నోరు,చర్మం.

6.పంచారామలు ---

సోమారామం(భీమవరం),
క్షీరారామం(పాలకొల్లు),
అమరారామం(అమరావతి),
కుమారరామం(సామర్లకోట),
ద్రాక్షారామం.


7.పంచభూతలింగాలు ---

శ్రీకాళహస్తీశ్వర స్వామి(వాయులింగం - కాళహస్తి),
నటరాజస్వామి (ఆకాశలింగం - చిదంబరం),
అరుణాచలేశ్వర స్వామి(అగ్నిలింగం - తిరువణ్ణామలై),
ఏకాంబరేశ్వరస్వామి (ప్రుథ్విలింగం - కాంచీపురం),
జంభుకేశ్వరస్వామి (జలలింగం - తిరువాణైకొవిల్(తిరుచ్చి))


8.పంచ నాట్యసభలు ---

[కనకసభ(గోల్డ్) - చిదంబరం],
[రజతసభ(సిల్వర్) - మదురై],
[తామ్రసభ(కాపర్) - తిరునల్వేలి],
[రత్నసభ(రూబి) - తిరువళంకాడు],
[చిత్రసభ(పిక్చర్) - కుట్రాలం].


9.పంచపాండవులు --- ధర్మరాజు,భీమసేనుడు,అర్జునుడు,నకులుడు,సహదేవుడు.

10.పంచముఖి రుద్రాక్ష --- అయిదు ముఖములు కల రుద్రాక్ష.

11.పంచపాత్ర --- పూజలలొ వాడే ఒక పాత్ర.

12.పంచవటి.

13.పంచాక్షరి మంత్రం.

పంచవటి యొక్క అర్దం తెలుపగలరు.
పంచాక్షరి మంత్రం తెలుపగలరు,అలాగే దాని అర్దం వివరించగలరు.


అందరికి ధన్యవాదాలు.
మీ విహారి.

10 comments:

హృదయ బృందావని said...

Thank U very much విహారి గారు!so nice of u :) మీక్కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు.

Viswanath said...

రాఖీ భందన్ శుభాకాంక్షలు---
హెడ్డింగ్ బాగుంది.
రాముడు నివసించిన పర్ణశాలను పంచవటి అంటారనుకుంటా...

jhansi papudesi said...

పంచాక్షరి అంటే "నమశ్శివాయ" అని అర్థం. అలాగే సీతారాములు వనవాసం చేసినప్పుడు ఉన్న ప్రాంతాన్ని పంచవటి అంటారు. అదిప్పుడు నాసిక్.

విహారి(KBL) said...

ఝాన్సి గారు చాలా థాంక్సండి.అలాగే హృదయ బృందావని గారికి,విశ్వనాథ్ గారికి.

మేధ said...

శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు

రవి వైజాసత్య said...

అయితే మీకిది బాగా నచ్చుతుంది
http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%B8%E0%B0%82%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A3_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

విహారి(KBL) said...

రవిగారు చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు.దానికి నా దగ్గర వున్నది కూడా కలిపాను.

Carani Narayana Rao said...

"సంకేత పదకోశం" అనే పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుంది.

"సంకేత పదకోశం" అనే ఈ పుస్తకం సంఖ్యలతో ప్రారంభమయ్యే అయా శాస్త్రపదాల వివరణనిచ్చే ఒక చిన్న సంఖ్యాపద నిఘంటువు.
దీనిలో వేద వేదాంగాలు, దర్శనాలు (అవైదీకమైన జైన, బౌద్ధ,చార్వాక దర్శనాలు కూడా),వ్యాకరణము, తర్కము,మీమాంస, జ్యోతిషము, అలంకారము,పురాణేతిహాసాలు,సంగీతము,ఆయుర్వేదము,అర్థశాస్త్రము మొ// శాస్త్రములకు చెందిన 2400 పదాలకు వివరణమియ్యబడ్డాయి.సంకేత పదాలను 'ఏక ' అనే పదం నుంచి, మన సంప్రదాయం ప్రకారం 'అష్టోత్తరశతం ' వరకు ఈకోశంలో చేర్చారు.

'పంచ ' అనే పదం కింద 300లకు పైనే ఆరోపాలున్నయి.
ఇదో మంచి సంప్రదింపు కోశము.

కోశ వివరాలు:
"సంకేత పదకోశము"
సంపాదకులు-ఆచార్య రవ్వా శ్రీహరి
రెండవ ముద్రణం 2002
పతంజలి పబ్లికేషన్స్
హైదరాబాదు
వెల రూ.125

padmaja said...

chala thanks andi. manchi information ichaaru.

padmaja said...

thanks to all. andaru manchi information ichaaru.