అందరికి నమస్కారం.
ఇది నా తవిక.తవిక ఏంటి అనుకుంటున్నార ఎమి లేదండి చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి రాస్తుంది చూసార తలకి రీటా,కాలికి బాటా,నాకిష్టం సపోట అని వాటిని తవికలంటారన్నమాట.అలాగని నాది హాస్య తవిక కాదు ఏదొ నాలుగు సంవత్సరాల క్రితం ఒక పైత్యం ప్రకోపించిన రోజు రాసినది ఇది . ఎంతైన నేను రాసినది కద కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు నా తవికని అప్పటినుంచి భద్రంగా దాచుకుని వస్తున్నాను.ఎలాగు బ్లాగు వుందిగా ఇందులో దాచుకుందామని రాసుకున్నా.
ఇక నా తవిక పేరు వసంతం.
అది ఒక చల్లని సాయంత్రం .అప్పుడే తొలకరి చిరుజల్లు కురిసి నేల తడిసింది.తడిసిన నేల నుంచి మట్టివాసన మనసును మైమరపిస్తుంది.మెల్లగ ఇంటి వెనుక పూలతోటలొకి వెళ్ళిన నాకు చల్లటి చిరుగాలి స్వాగతం పలికింది.ఆరుబయట ఆ పూలతోటలో పడుకున్న నాకు దూరంగా కొండపైన సప్తవర్ణాల ఇంద్రధనస్సు కనిపించింది.అలా చుస్తూ ఆ చల్లగాలికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.మధ్యరాత్రి కనులు తెరచిన నాకు నిండు పున్నమి జాబిలి వెన్నెలతో జోలపాడుతున్నట్లుగా అనిపించింది.పక్కనె చిన్ని కొలనులొ చంద్రుని ప్రతిబింబం మెరుస్తుంది.కలువపూలు రెండు విచ్చుకుని ఒకదానితొ ఒకటి దోబూచులాడుకుంటున్నాయి.మైమరచిన నేను మరలా నిద్రలోకి జారుకున్నను.
అప్పుడే తెలతెల్లగా తెలవారుతుంది.మంచు కొద్దిగ కురుస్తుంది.మల్లెలు గుభాలిస్తున్నాయి.తన లేలేత కిరణాలతో భాస్కరుడు బయలుదేరాడు.లేలేత కిరణాలు ఆకుల మీద మంచు బిందువులపై పడి ముత్యాల్లా మెరుస్తున్నాయి.పక్షులు కిలకిలరావాలు వినసొంపుగా వున్నాయి.కుహుకుహు అంటూ కోయిలమ్మ వసంతాన్ని ఆహ్వానిస్తూ నన్ను తట్టిలేపింది. కర్తవ్యం గుర్తుకొచ్చిన నేను కార్యొన్ముఖుడనై అక్కడినుంచి నిష్క్రమించాను.
3 comments:
మంచుకురుస్తుండగానే మల్లెలు గుబాళించడం నిజంగా తవికల్లొనే సాధ్యం. టైటిల్‌కి తగినట్టు చాలా సరదాగా ఉంది మీ తవిక :)
మరీ అంత తవికలా లేదు కొంచెం....
కాదు కొంచెంఎక్కువగానే కవితలా ఉంది.
ఇంకా మంచి తవికలు రాసి పోస్ట్ చేయండి.
పుస్తకం చదివి చేసిన వంటలా నిస్సారంగా ఉంది. తమ్మిడూ, నువ్వు కవితలు వ్రాయటం కంటే చదువుకోవటం మంచిది.
Post a Comment