Saturday, August 11, 2007

అరుకులోయ --- బొర్రా గుహలు

అందరికి నమస్కారం.
అతి పురాతనమైన బొర్రా గుహలు చూసి వద్దాం రండి.
ట్రైన్ లొ అరుకు వెళుతుంటే బొర్రా స్టేషన్ వస్తుంది.
అక్కడ దిగితే నడిచి గుహలు దగ్గరికి వెళ్లవచ్చు.లేదంటే అక్కడ చాలా ఆటొలు,జీపులు వుంటాయి.అవి ఎక్కి వెళ్లవచ్చు.
ఇక్కడె గోస్తనీ నది ప్రవహిస్తుంది చూడవచ్చు.అది మంచి సీనరి.బయట ఎంత వెచ్చగా వున్నా గుహ లొపలకి వెళ్ళగానే చల్లగా వుంతుంది. ఎన్నొ వేలకు పూర్వమే ఈ గుహలు ఏర్పడ్డట్టు చెబుతారు.ఈ గుహలనుంచి కాశికి దారి వుందని అంటారు.అది ఎంత నిజమొ తెలీదు. పై నుంచి చుక్కలు చుక్కలుగా నీరు కారుతూ వుంటుంది.ఆ నీరే గడ్డ కట్టి రాళ్ల కింద రూపాంతరం చెందాయి.ఆ రాళ్లు వివిధ దేవతలు ,బొమ్మలుగా ఏర్పడ్డాయి.అవి మనం కనిపెట్టడం కష్టం.అక్కడ గైడులు వుంటారు .వాళ్లని నియమించుకుంటే వాళ్లు మొత్తం టార్చ్లైట్ వేసి చుపిస్తూ వివరిస్తారు.కానీ లొపల కొన్ని చొట్ల గబ్బిలాలు వాసన వస్తుంది.లొపల చాలా జాగర్తగా చుసుకొని నడవాలి.మా చిన్నప్పుడు లైట్ లు వుండేవి కావు.అంతా చీకటిగా వుండేది. గైడులు కాగడాలు పట్టుకొని చూపించేవారు.ఏ మాత్రం కాలు జారినా అంతే.ఇప్పుడు లైట్లు పెట్టారు.కనుక ఏ భయం లేకుండ నిరభ్యంతరంగ వెళ్ళిరావచ్చు.

మొదటి ఫొటొ చూసార అది ముఖ ద్వారం .ఇక రెండొ ఫొటొ గుహలొపలికి వెళ్ళే ద్వారము.ఇక ఈ మూడొ ఫొటొ చూసారా.దీనికి ఒక కధ వుంది.కాని నాకు ఆ కధ గుర్తు లేదు.ఆవు దూడ పైనుంచి పడటం వల్ల అది ఏర్పడిందంటారు.


ఇక్కడ సినిమా షూటింగ్ లు జరుగుతాయి.జగదేకవీరుడు - అతిలోక సుందరి సినిమాలొ మొదటి పాట(మేరా నాం రాజు )మరియు శివ మూవీ లొ ఒక సాంగు ఉదాహరణలు.

వేళలు:
ఉదయం 10 నుంచి మధ్యానం 1 వరకు తిరిగి 2 నుంచి 5.30 వరకు.

అక్కడ హొటెల్స్,షాపులు వుంటాయి భొజనానికి,నీటికి ఇబ్బంది వుండదు.

అదండి
మళ్ళి కలుస్తాను
అంత వరకు సెలవు
మీ
విహారి
ఫొటొలు గొ టు ఇండియా వారి సౌజన్యంతొ

4 comments:

Viswanath said...

మీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది.తెలుగు వికిపిడియాకు ఇలాంటి పొటోలు బాగా ఉపయోగపడుతాయి.
వీలయితే అప్లోడ్ చేయండి.మీ పొటోలను ఇంకా ఎక్కువమంది చూడగలుగుతారు.

radhika said...

చాలా బాగున్నాయి ఫొటోలు.గుహల్లో శివలింగం ఫొటో తియ్యలేదా?

మేధ said...

ఫొటోస్ చాలా బావున్నాయి.. కానీ కేవలం 3ఫొటోస్ మాత్రమే పెట్టారేంటి.. ఇంకా ఉండి ఉంటాయి కదా అవి కూడా పెట్టండి.. విశ్వనాథ్ గారు చెప్పినట్లు, వికీపీడియా లో పెట్టండి అందరికీ చాలా ఉపయోగపడతాయి.

Katam said...

Aavu duda padatam valla kaadu..oka aavu duda aa randhram lo nundi lopaliki padipovatam vallane..ee guhalu anevi kanipettagaligaarata..appati varaku evariki ee guhalagurinchi theleedata