పల్లె కన్నీరు పెడుతోంది...
బీడైపోయిన నేలను చూసి
'సెజ్'ల పాలైన పంటచేలను చూసి
కబేళాలపాలైన గోమాతలను తలచి
అప్పులపాలైన అన్నదాతను చూసి
ఉరికొయ్యలపాలైన నేత కార్మికులను తలచి
వలసపోయిన జనాలను తలచి
బోసిపోయిన ఉమ్మడింటిని చూసి
మమ్మీ డాడీలైపోయిన అమ్మానాన్నలను తలచి
పాడిపంటలతో,పసిడిరాశులతో
ఉమ్మడికుటుంబాలతో,ముంగిటముగ్గులతో
ఆత్మీయత నిండిన పలకరింపులతో
అలరారిన తన గత వైభవాన్ని తలచి
భవిష్యత్తు మీద బెంగతో
పల్లె కుమిలి కుమిలి కన్నీరు పెడుతోంది