అందరికి కొత్తబంగారులోకానికి స్వాగతం.చాలా రొజులైపోయింది టపా వేసి.ఎన్నొ రాయాలని వున్నా టైం లేక రాయటం కుదరటం లేదు.
ఇక ఈ టపా రాయటానికి కారణం పాత పాటలు వినేవారికి,విననివారికి ఒక తీయటి స్వరం గురించి మీకు చెప్పటానికి.ఆ స్వరం లీల గారిది.మీలో కొంతమందికి లీల గారి గురించి తెలిసి వుండవచ్చు కాని చాలా మందికి ఆమె గురించి తెలీదు.అందుకే ఈ టపా. ఇక నాకు లీలగారి గురించి తెలిసింది ఎప్పుడంటే ఆమె చనిపోయినప్పుడు.అప్పటికివరకు లీల అనే గాయని ఉన్నట్లు నాకు తెలీదు.నాకే కాదు చాలా మందికి ఆమెగురించి ఇప్పటికి తెలీదు.ఆమె చనిపోయినప్పుడు ఈనాడులో చిన్న పేరా రాసాడు.అప్పుడే నాకు లీల అనె గాయాని ఉందని తెలిసింది.ఇది చాలా బ్యాడ్.
ఎప్పుడైతే ఆణిముత్యాలు బ్లాగు ప్రారంభించి పాత పాటలు వినటం మొదలుపెట్టనో అప్పటినుంచి ఆ స్వరానికి అభిమానిగా మారిపోయాను.
లీలగారిది కేరళలోని చిత్తూరు.ఆమె ఘంటసాలతో కలిసి ఎన్నో హిట్ సాంగ్స్ తెలుగు,తమిళ్ లో పాడారు.సుశీలగాతో కలిసి లీలగారు పాడిన పాటలు ఇప్పటికి అందరిని అలరిస్తాయి.
ఆవిడ గురించికన్నా ఆవిడ పాడిన పాటలు చెపితే అందరికి బాగా తెలుస్తుంది.నవరత్నాలులాంటి
తొమ్మిది పాటలు చెపుతాను అవి చాలు ఆ స్వరాన్ని గురించి తెలపటానికి.
1.ఏమిటో ఈ మాయ చల్లని రాజ
మిస్సమ్మలోని ఈ పాట వినే వుంటారు.ఈ పాట పాడింది లీలగారే.ఈ పాటే కాదు ఈ చిత్రంలోని మిగతా పాటలు
రావోయి చందమామ,తెలుసుకొనవె చెల్లి,కరునించు మేరి మాత మొదలైన ఆణిముత్యాలని పాడింది లీలగారే
2.సడి సేయకో గాలి
ఈ పాట రాజమకుటం లోనిది.ఈ పాట వింటుంటే చాలు హాయిగా నిదురపోవచ్చు.
3.కలవరమాయె మదిలో నా మదిలో
పాతాళభైరవి సినిమాలోని ఈ పాట వినే వుంటారు.
4.ఏచటినుండి వీచెనో ఈ చల్లని గాలి
అప్పుచేసిపప్పుకూడులోనిది ఈ పాట.
5.అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం
ఈ అందమైన పాట లీలగారిగొంతులో మరింత అందంగా వినిపిస్తుంది.ఈ పాట "బ్రతుకుతెరువు" సినిమాలోనిది.
6.ఓహో మేఘమాల నీలాల మేఘమాల
ఈ పాట "భలేరాముడు" సినిమాలోనిది.
7.లాహిరి లాహిరి లాహిరిలో
మాయాబజార్ సినిమాలోని ఈ పాట అందరికి తెలుసు.కాని ఈ పాట పాడింది లీలగారని చాలా మందికి తెలీదు.
8.చల్లనిరాజా ఓ చందమామ
"ఇలవేల్పు" సినిమాలోని ఈ అద్భుతమైన విన్నారా
9.జలకాలాటలలో కలకల పాటలలో
"జగదేకవీరుని కథ" లోనిది ఈ పాట
పైపాటలు చాలు లీలగారి గొంతులోని మాధుర్యం గురించి చెప్పటానికి.ఒక కామన్ విషయం గమనించారా
దాదాపు అన్ని చల్లగాలి,వెన్నెల సంభందించినవే.లీలగారు ఎక్కువ పాడినవి భక్తి గీతాలు,సోలో సాంగ్స్.
మిస్సమ్మ,పెళ్లి చేసి చూడు ,రాజమకుటం,పాతాళభైరవి,మాయాబజార్,అప్పుచేసిపప్పుకూడు,జగదేకవీరుని కథ,దొంగల్లో దొర,భలే అమ్మాయిలు,పెళ్ళినాటి ప్రమాణాలు,పాండవ వనవాసం,గుండమ్మ కథ,చిరంజీవులు మొదలైన సినిమాలలో ఎన్నో ఆణిముత్యాలవంటి పాటలని పాడారు.
ఇన్ని చెప్పి ఒక సినిమాగురించి చెప్పకపోతే చాలా తప్పు.అది లవకుశ.ఆ సినిమాలో సుశీలగారితో కలిసి లీలగారు కలిసి పాడిన ప్రతి పాట ఇప్పటికి అజరామరమే."రామ కథను వినరయ్య","శ్రీరామ సుగుణధామ" మొదలైన పాటలు మీరు వినే వుంటారు.
ఆవిడ ఇప్పుడు లేక పోయిన ఆవిడ పాటలు అందరిని అలరిస్తూనే వున్నాయి.ఆవిడ గురించి ఎవరో చెప్పక్కరలేదు ఆ పాటలే చెబుతాయి.
మళ్ళి కలుద్దాం అంతవరకు మీరు ఆ పాటలని విని ఆనందించండి.