Thursday, August 16, 2012

వీరబ్రహ్మంగారు నడయాడిన బనగానపల్లి ఫొటోలు

యాగంటికి వెళ్ళే దారిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నడయాడిన బనగానపల్లిలోని ఉంది. బనగానపల్లినుంచి యాగంటి 10 కి.మీ.

బ్రహ్మం గారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఇంటిని మ్యూజియంగా మార్చారు.



బ్రహ్మం గారి జీవితానికి సంబందించిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మం గారు ఇక్కడ నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి, అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు.



రవ్వలకొండ ప్రాంతం. ఈ చెట్టు కిందే ఆవులను కట్టేవారు.







ఎండిపోయిన బావి



బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహకి దారి.



గుహకి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఖరీదు 2 రూ.



గుహలోకి వెళదాం





ఈ గుంట స్వామి వారు స్నానం చేయటానికి వాడినది.



గుహలోనుంచి శ్రీశైలం, మహనంది, యాగంటి వెళ్ళటానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడి స్వామి వారు ఆ ప్రాంతాలకి వెళ్ళేవారు.







ఇక్కడ నుంచే అచ్చమాంబగారు స్వామివారు కాలజ్ఞానం రాయటం చూశారు.



బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం





బనగానపల్లిలో స్టే చెయ్యటానికి ప్రెవేట్ లాడ్జులతో పాటు బ్రహమంగారి మఠం వారి వసతి గృహాలు ఉన్నాయి. మఠం వారి వసతి గృహాలు అచ్చమాంబగారి ఇల్లు, రవ్వలకొండ ప్రాంతాల్లో ఉన్నాయి. అచ్చమాంబగారి ఇంటి దగ్గర ఉన్న వసతి గృహాలు ఇవే. ఇక్కడ ఏసి సదుపాయం కూడా ఉంది.