సాయిబాబా పుట్టిన పత్రి గ్రామంలోని ఆయన జన్మించిన ఇంటి స్థానంలో కట్టిన మందిరమే సాయి జన్మస్థాన్ మందిర్.
పత్రి, పర్భని నుంచి 45 కి.మీ దూరంలోను, సేలు నుంచి 22 కి.మీ దూరంలోను, మన్వత్ రోడ్డు స్టేషన్ నుంచి 17 కి.మీ దూరలోను ఉంది. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ పాసింజర్ ఎక్కి లేదా ఇతర రైళ్ళ ద్వారా పర్భనిలో గాని, మన్వత్ రోడ్ స్టేషన్్‌లో గాని, సేలులో గాని దిగి అక్కడి నుంచి బస్సుల ద్వారా పత్రి చేరుకోవచ్చు.
పత్రి బస్ స్టాండ్
సాయి మందిరం
భక్తి నివాస్ - ప్లాన్
క్రింద, ప్రస్తుతం ఉన్న భక్తి నివాస్. ఇది మందిర ప్రాంగణంలొనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ 200 మందికి వరకు వసతి సదుపాయానికి వీలు ఉంది. దీనిని మరింత పెంచటానికి చూస్తున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలొనే ఉన్న భక్తి నివాస్ వసతి గృహంలో ఉండవచ్చు మరియు అక్కడే ఉన్న ప్రసాదాలయంలో భోజన సదుపాయం పొందవచ్చు.
భూగృహంలోని ధ్యాన మందిరం.
డొనేషన్ వివరాలు
మందిర నిర్మాణ సమయంలో దొరికిన సాయి బాబా జన్మించిన ఇంటిలోని వస్తువులు మరియు ఇంటి పునాదులు.
ఆలయం లోపలి భాగం
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఇమేజ్‌లో ఉన్న వెబ్ సైటులను చూడండి. లేదా నాకు ఒక కమెంటు వ్రాయండి.
సాయి భక్తులు తప్పక దర్శించదగిన ప్రాంతం, సాయి జన్మస్థాన మందిరం పత్రి. ఓం సాయిరాం.