బృందావన్ గార్డెన్స్ మైసూరుకి 25కి.మీ దూరంలో కృష్ణరాజసాగర్ డ్యాం ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ ఒక అందమైన ఉధ్యానవనం. అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్లతో ఏర్పాటుచేయబడింది.
ఇక్కడ ప్రతి రోజు సాయంత్రం 6:30 నుంచి మ్యూజికల్ ఫౌంటైన్ లైట్ షో ఉంటుంది. ఇది తప్పకుండా చూడాలి.
శని, ఆది వారాలు, సెలవు దినాలు మరియు సీజన్లో ఇక్కడ విపరీతమైన రద్దీగా ఉంటుంది. అందుకె సాయంత్రం 4 లేదా 4:30 కల్లా ఇక్కడ ఉండేలా చూసుకుంటే సౌత్ గార్డెన్లో అన్ని చూసుకొని 6 కల్లా నార్త్ గార్డెన్ కి చేరుకుంటే లైట్ షో చూసుకొని 7 లేదా 7:30 కి తిరిగి ప్రయాణం అయితే ఈ రద్దీ నుంచి కొంత తప్పించుకొవచ్చు. అన్ని చూసిన అనుభూతి పొందవచ్చు.
కృష్ణరాజసాగర్ డ్యాం
వసతికి మైసూరు మరియు గార్డెన్‌కి వెళ్ళే దారిలో లాడ్జిలకు కొదవే లేదు.