Monday, September 3, 2007

శ్రీ కృష్ణాష్టమి సంగతులు

చిన్నప్పుడు కృష్ణాష్టమి వస్తుందంటే చాలు అంతా హడావిడిగా వుండేది.పది పదిహేను రోజులముందునుంచే తయారు అయ్యేవాళ్లం.ఒక రేకు అమూల్ డబ్బా తీసుకుని దాని మూతకి చిల్లు పెట్టి దాన్ని తీసుకుని చందాలు పోగుచెయ్యటానికి రోడ్డు మీద పడేవాళ్లం.రోడ్డు మీద వెళ్ళే వాళ్లని బలవంతంగా ఆపి వాళ్ల దగ్గర డబ్బులు గుంజేవాళ్లం. సైకిల్ మీద వెళ్లే వాళ్ల వెంటపడి విసిగించి మరి చందా వసూల్ చేసి మొత్తనికి డబ్బు పోగుచేసేవాళ్లం.రెండు రోజులముందు ప్రసాదాలకి కావలిసిన సరుకులు తెచ్చి ఎవరోఒకళ్ల ఇంట్లొ ఆ పని అప్పగించేవాళ్ళం.ఇక పండగ రోజు ఉట్టి కొట్టే సన్నివేశం భలేగుండేది.ఉట్టిలొ పెరుగు,డబ్బులు అవి వేసి పైన కట్టి లాగుతుంటే దానిని కొట్ట్డానికి ఎగబడేవాళ్లం.ఎవరు పగలకొడితే వాళ్లే హీరొ.అది పగిలాకా డబ్బులు ఎరుకోవటనికి పెద్ద గొడవ.ఆ డబ్బులు వాడకూడదు అని చెబితే దేవుని దగ్గర హుండిలొ వేసేసి ప్రసాదాలకోసం కొట్లాట.అప్పట్లో చానల్స్ వుండేవి కాదు కాబట్టి సినిమాలంటే పిచ్చి .ఒకరు ఇద్దరు ఇంట్లొ టివి వుండేది.వాళ్ళని బతిమాలి బామాలి ఒప్పించి వీడియొ ప్లేయర్లు,కేసెట్లు తెచ్చి రాత్రంతా సినిమాలు చూస్తూ జాగారం.అలా సరదాగ గదిచిపొయేది. ఇప్పుడు పండగ లేదు పబ్బం లేదు.రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి.

4 comments:

మేధ said...

అవునండీ, ఇప్పుడు ప్రతిదీ యాంత్రికంగా మారిపోతోంది.. అందుకేనేమో, "Olden Days are Golden Days" అని అన్నారు.... మీ చిన్నప్పటి సంగతులు చెప్పి మళ్ళీ ఆ విషయాలన్నీ గుర్తు చేశారు...

విశ్వనాధ్ said...

మీ బ్లాగును భలే అందంగా తయారు చేస్తునారు.
మీ కవిత మీద ఓ కామెంటుపై చిన్న మాట చెప్పాలనిపించింది.
ఏదైనా ప్రయత్నంలో మనం ఫెయిలైతే కొందరు నవ్వచ్హు,
లేదా విమర్శించవచ్హు
నవ్విన వారికి ఒక విషయం తెలియదు.అది
ప్రయత్నం వలన రెండవసారి కోసం అనుభవం అయినా మిగులుతుంది.
మరి నవ్విన వాళ్ళకో..?

విహారి(KBL) said...

చాలా ధాంక్సండి విశ్వనాథ్ గారు ,మేధా గారు.
తెలుగుభామిని గారు అన్నవి పట్టించుకుంటే ఎవరు బ్లాగులు రాయక్కరలేదు.

Girishwar Reddy said...

Very Good one.....