Tuesday, September 4, 2007

సింహాచలం

అందరికి నమస్కారం.


నేను డిగ్రీ లో వుండగ మా ఫ్రెండ్స్ ఆరుగురు కలిసి సరదాగ వైజాగ్ టూర్ కి వెళ్ళాం.మా స్నేహితులలొ ఒక అబ్బాయి వాళ్ళ పెదనాన్నగారు సింహాచలం గుడిలొ ప్రధాన అర్చకులు.మాకు వాళ్ల ఇంట్లోనే మకాం.పొద్దున్నే అన్ని పనులు ముగించి గుడికి బయలుదేరాము.కొండ మీద వెలసిన శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటానికి రెండు మార్గాలు వున్నాయి.ఒకటి మెట్లదారి.రెండు గాట్ రోడ్లో బస్ ప్రయాణం.మేము వెళ్ళటప్పుడు బస్ కి వచ్చేటప్పుడు మెట్లమీదుగ నడిచివచ్చాం.గుడిలొ ఉచితదర్శనం,50రూ|| ప్రత్యేక దర్శనం వున్నాయి.మేము పూజారిగారి తరుపున కాబట్టి మాకు ప్రత్యేక దర్శనంలొ ఉచితదర్శనం.గర్బగుడి దగ్గరకు వెళ్ళే అద్రుష్టం కలిగింది.కావలసినంత సేపు దర్శనం చేసుకుని తరవాత పూజరిగారు ఇచ్చిన పులిహోర,దద్దొజనం,పొంగలి సుబ్బరంగా లాగించి గుడిలో మళ్లి ఒకసారి రౌండ్ వేసి మెట్లమీదుగా దిగివచ్చేసాం.

చరిత్ర:




ప్రహ్లాదుని రక్షించటానికి నరసింహావతారంలోఅవతరించి హిరణ్యకశిపున్ని సంహరించిన తరువాత ప్రహ్లాదుని కోరికపై స్వామి ఇక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారు.244మీటర్ల ఎత్తెన కొండపై వెలిసిన ఈ స్వామికి 11వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని కట్టించారు.తరువాత విజయనగరరాజులైన ప్రతాపరుద్రగజపతి ఆలయానికి మరికొన్ని మెరుగులు దిద్దారు. గత రెండు దశాబ్దాలుగా విజయనగర రాజవారసులే దేవస్థాన ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.గుడిలో కప్పస్థంభం వుంటుంది.దీనిని కౌగిలించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరతాయని అంటారు.

చందనోత్సవం :




ప్రతి యేడాది వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగే చందనోత్సవానికి ఆంధ్రప్రదేశ్,ఒరిస్సా,కర్ణాటక,తమిళనాడు నుంచి భక్తులు విపరీతంగా వస్తారు.ఈ చందనోత్సవాన్నే నిజరూపదర్శనం అని కూడా అంటారు.సంవత్సరంలోని 364 రోజుల 12 గంటలు చందనంతో కప్పబడి వుండే స్వామి ఆ రోజు ఉదయం 3 నుంచి సాయంత్రం వరకు మాత్రమే స్వామి నిజరూపదర్శనం కలుగుతుంది.ఆ రోజు స్వామి ఒంటి మీది చందనాన్ని తీసివేసి అభిషేకించి కొత్తగా చందనాన్ని పూస్తారు.నిజరూప దర్శనానీ మొదట విజయనగర రాజవంశీకులు చూస్తారు.తర్వాత భక్తులని అనుమతిస్తారు.ఉచిత దర్శనానంతో పాటు రూ. 30, రూ. 100, రూ. 500 , రూ. 1000 టికెట్లు అమ్ముతారు.

ప్రయాణం:

వైజాగ్ లో సింహాచలం కొండ దిగువున వుండే బస్ స్టాపుకి వెళ్లటానికి లొకల్ బస్సులు వుంటాయి.కొండ మీదకి దేవస్థానం వారు ప్రత్యేక బస్సులని నడుపుతారు.దాని టికెట్ ధర రూ.6.

3 comments:

GKK said...

వ్యాసం బాగుంది. కవితపై నా అభిప్రాయంతో నొప్పించినందుకు సారీ.

రాధిక said...

మీతో పాటూ మమ్మల్ని కూడా విహరింపచేస్తున్నారు.థాంక్స్.

విహారి(KBL) said...

ధన్యవాదాలు తెలుగుభామినిగారు.రాధికగారు మీకు కూడా.