Friday, September 7, 2007

మా కాలేజ్



ఇది మా కాలేజ్.దీని పేరు జె.జె కాలేజ్.అంటే జయలలితా జయరామన్ కాలేజ్.ఈ కాలేజ్ ఎవరిదంటే మాజీ క్రేంద్ర హోం శాఖ సహాయమంత్రి,ప్రస్తుత కేంద్ర పర్యవరణం,అడవుల శాఖ సహాయమంత్రి రఘుపతి గారిది.ఆయన "అన్నా డి.ఎం.కె" లో వుండగ స్థలం తీసుకుని జయలలిత పేరు మీద కాలేజ్ పెట్టి తర్వాత "డి.ఎం.కె" లొకి జంప్ జిలాని అన్నమాట.ఇప్పుడు "డి.ఎం.కె" తరుపున కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.ఇప్పుడు ఆయన కూతురు,అల్లుడు దీని భాద్యతలు చూసుకుంటున్నారు.ఈ కాలేజ్లోనే నేను ఎమెస్సీ వెలగపెట్టాం అన్నమాట.ఇది తమిళనాడు లోని పుదుకొట్టై లో వుంది.తిరుచినాపల్లి(తిరుచ్చి)నుంచి ఒక గంట ప్రయాణం.



ఈయనే రఘుపతిగారు.ఈకాలేజ్ స్థాపకులు.


ఇది కాలేజ్ మెయిన్ బిల్డింగ్.పైనుంచి చూస్తే లోటస్(పద్మం) ఆకారంలో కనిపించేలాగ దీనిని కట్టారు.ఇందులోనే దాదాపు అన్ని కార్యకలాపలు జరుగుతాయి.



ఇది సైన్స్ సబ్జెక్ట్స్ సంబందించిన లాబొరెటరి బ్లాక్ .ఇక్కడే లాబ్ వర్క్స్ జరుగుతాయి.




ఇది ఎంబీఎ బ్లాక్ .



ఇది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ లాబ్.ఇంకా నర్సింగ్,కాంటిన్,హాస్టల్స్ మొదలగు వాటితో చిన్న యునివర్సిటి లాగ వుంటుంది.


ఇది ఇండోర్ స్టేడియం.మా చివరి సంవత్సరంలొ మొదలు పెట్టి మేము కాలేజ్ వదిలే సమయానికి ఇది పూర్తి చేసి 2 సంవత్సరాల క్రితం దీనిని ప్రారంభించారు.ఫొటొలొ కన్నా నిజంగా చుస్తే అద్బుతంగా వుంటుంది. ఎక్కడికెళ్ళినా తెలుగు వాళ్ళే అన్నట్లు ఈ కాలేజ్ లో 50 శాతం మంది తెలుగు వాళ్ళే.30 శాతం మంది మలయాళీలు.మిగిలిన 20 శాతం మంది తమిళులు.అది ఈ కాలేజ్ స్పెషల్.
ఇది మా కాలేజ్ గురించిన సుత్తి కధ.

మా పుదుకొట్టై గురించిన విషయాలు తరువాతి టపాలో.

3 comments:

GKK said...

Nice write-up with pictures. This seems to be your forte.

విశ్వనాధ్ said...

పోయినరోజులన్నీ సంతోషమయినవే.జ్ఞాపకాలు కొంతకాలానికి మాసిపోతాయి.మాసిపోయే అవకాసంలేకుండా చేసుకొనే మీరు అభినందనీయులు.

S said...

జంప్ జిలానీ ... :))
బాగుంది వాడుక.