పుదుకొట్టై చూసొద్దాం రండి.
పుదుకొట్టై - తమిళ్ లో "పుదు" అంటే కొత్త "కొట్టై" అంటే కోట మొత్తంగా కొత్తకోట అన్నమాట.పుదుకొట్టై అనేది జిల్లా పేరు మరియు ఊరి పేరు.అదే ఆ జిల్లా ముఖ్య రాజధాని.ఇది తిరుచిరాపల్లి(తిరుచ్చి) నుంచి సుమారు 54 కి.మీ వుంటుంది.కాని గంట,గంటంపావు లోపు అక్కడికి చేరుకొవచ్చు.అంతా జాతీయ రహదారి కావటం వల్ల బస్సులు అంత ఫాస్ట్ గా వెళ్తాయి.పుదుకొట్టై నుంచి మదురై 106 కి.మీ. రెండు నుంచి రెండుంపావు గంటల్లో అక్కడికి వెళ్లవచ్చు.తిరుచ్చి నుంచి మదురై వెళ్ళే దారిలోనే ఇది వుంది.ఒకప్పుడు పల్లవులు,చొళులు,హోయసాళులు,విజయనగర రాజులు,మదురై నాయకరాజుల ఏలుబడిలోవున్న ఈ పట్టణం తరువాత తొండమన్ చక్రవర్తులు ద్వారా ఆంగ్లేయుల పాలనలొకి వెళ్లి స్వాతంత్రం తర్వాత ప్రజాస్వామ్యం లో కలిసింది.ఒకప్పుడు తిరుచ్చి కలిసివుండేది.1971 నుంచి సొంత జిల్లాగా ఆవిర్భవించింది.
ఈ భవనాలు,ఆర్చ్ బ్రిటీషర్స్ కాలంలో కట్టినవే.పేరుకి జిల్లా రాజధాని కాని అంతగా అభివ్రుద్ధి చెందలేదు.మొన్నటిదాకా మీటర్‌గేజ్ పాసెంజర్ రైలువ్యవస్థే వుందేది.రామేశ్వరం వెళ్లే దారిలో వుండటం వల్ల ఈ మధ్యే ఇది కూడ బ్రాడ్‌గేజ్‌గా మార్చటం జరిగింది.ఊరిలో మొత్తం నాలుగే సినిమా హాళ్ళు.అందులో రెండే మంచివి.కాలక్సేపానికి అవి ఎమి సరిపోతాయి చెప్పండి.పుదుకొలను అని ఒక పెద్ద కొలను మాత్రం వుంది.మన హుస్సేన్ సాగర్లాగ వుండకపోయిన ఎదొ వుంటుంది.అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వచ్చేవాళ్ళం.ఓ మాదిరి షాపింగ్ ఏరియా వుంటుంది. జిల్లా కి ఉత్తరాన తిరుచ్చి,తూర్పున తంజావూరు ,బంగాళఖాతం,దక్షిణాన రామనాథపురం జిల్లాలు వున్నాయి.
ఇక ఈ ఫొటొ లో వున్నవి తిరుమయం ఫొర్ట్ మరియు పల్లవుల కాలంలో కట్టిన రాక్ కట్ కేవ్ టెంపుల్ ఇది.కొండను తొలచి కట్టారు అందుకే ఆ పేరు. ఇంకా పుదుకొట్టై లో ఒక చిన్న మ్యుజియం కూడా వుంది.ఇందులో పాతకాలం నాటి సామనులు,నాణాలు మొదలైనవి వుంటాయి. ఇక్కడికి తిరుచ్చి,శ్రీరంగం,తంజావూరు,మదురై,రామేశ్వరం అన్ని కూడా దగ్గరలోనే వుంటాయి.పట్టణంలో ముస్లిం జనాభా కూడా ఎక్కువే.దీపావళి,రంజాన్ వేళల్లొ షాపింగ్ ఏరియాలో అడుగుతీసి అడుగు వెయ్యలేనంత రద్దిగా వుంటుంది.రాజధాని కావటంవల్ల ప్రభుత్వకార్యాలయాలు,కళాశాలల విద్యార్ధులతొ మాములు సమయంలో కుడా కలకలలాడుతూ వుంటుంది.మా కాలేజ్ మాత్రం వూరికి 5 కి.మీ.దూరంలో మదురై వెళ్ళే రూట్లో వుంటుంది చుట్టూ చెట్ల మధ్య ప్రశాంతంగా.
2 comments:
ఈ Rock cut cave temple ఏవో కొన్ని తెలుగు సినిమాల లో చూసిన జ్ఞాపకం.
meeru anni bhale rastarandi.. ee place aina sare danni oka tourist spot laga describe chestu rastaru.. even mee clg ni kuda alane chupinchaaru..!
waiting for more like this...
Post a Comment