కొడైలో సొంత వాహనం వుంటే అన్నిచోట్లకి తిరగవచ్చు.లేదా టాక్సిలోనో,సైకిల్లు అద్దెకి తీసుకుని తిరగవచ్చు.మరీ ఎక్కువ సమయం వుంటే కాలినడకన వెళ్ళినా కొడై అందాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.పక్షులని పరిశీలించేవారికి ఈ ప్రాంతంలో అనేక జాతుల పక్షులు కనిపిస్తాయి.
కొడైలో అందరు మొదట వెళ్ళేది కోకర్స్ వాక్ ఇది కొడైకి వాయువ్య దిశగా సాగే నిట్టనిలువు రోడ్.పొద్దునే ఇక్కడికి చాలా మంది వాకింగ్ కి వస్తారు.

ఇక్కడ ఒక అబ్జర్వేటరి వుంది.బైనాక్లురర్లో కొడై అందాలు వీక్షించవచ్చు.దీనికి ఎదురుగా బ్రయంట్ పార్క్ వుంది.కొడైకి 7 కి.మీ దూరంలో సిల్వర్ కేస్కేడ్ జలపాతం వుంది.ఇది కాక ఇంకా బంబర్,గ్లెన్,ఫెయిరీ ఫాల్స్,బేర్ షొలాఫాల్స్ మొదలైన జలపాతాలు వున్నాయి.

తమిళులు మురుగన్ గా పిలిచే సుబ్రమణ్యస్వామి కోవెల కురుంజి ఆండవర్ కోవెల చూడదగ్గది.

అక్కడినుండి పళని కొడలు,వైగై డ్యాముల అద్బుత దృశ్యాలు కనిపిస్తాయి.కనువిందు చేసే మరో ప్రాంతం పెరుమాళ్ పీక్.కొడైకి 12 కి.మీ దూరంలో వున్న ఇదే కొడై కొండల్లో అతి ఎత్తైన శిఖరం.శెంబగనూర్ మ్యూజియం కూడా చూడదగ్గది.

వర్షంలో తడిసిన కొడై మరింత అందంగా వుంటుంది.కాని వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళలేం.
అదండి.ఇక కొడై కి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు(ఫైనల్ టచ్)ఆఖరి టపాలో తెలియచేస్తాను.అంతవరకు సెలవు.
1 comment:
విహారి గారు మీ బ్లాగులన్నీ చదివాను చాలా బాగున్నాయి.ముఖ్యంగా మీ కొడైకెనల్ బ్లాగు చాలా బాగుంది.కొడైకెనల్ మొత్తం కళ్ళకు కట్టినట్లు చూపించినారు.అందుకు మీకు ధన్యవాదములు.నేను కూడ ఈ మధ్య ఈ ప్రపంచములో అనగా బ్లాగు ప్రపంచములో సభ్యుడినైతిని వీలైతే నా బ్లాగు చదివి మీ అభిప్రాయములు తెలుపగలరని ప్రర్ధన.
Post a Comment