Wednesday, October 17, 2007

మంచు కురిసే వేళలో కొడై అందాలు

కొడై కెనాల్ అందాలు మంచు కురిసేటప్పుడు మరింత అందంగా వుంటాయి మంచులో తడిసిన ముద్దమందారంలా.మంచులో తడిసిన కొడైని చూసే భాగ్యం కలగటం అదృష్టం.కొడైలో చూడదగ్గ ప్రదేశాలలో పిల్లర్ రాక్స్ ఒకటి. ఇది లేక్ నుంచి సుమారు 8 కి.మీ.వుంటుంది.మబ్బులు మన పైనే తేలియాడుతున్నట్లు వుంటుంది ఇక్కడ.ఇవి 400 అడుగుల ఎత్తున స్తంభాలులా వుండే మూడు రాళ్ళు.ఇక్కడ డ్రై ఫ్లవర్స్ అమ్ముతారు.
కులుకులొలుకు చెలి చెంతనుండగా ఊటి,కొడైకెనల్ ఏలనో అని పాట వుందిగాని కొడై వచ్చెది ఎక్కువమంది కొత్త జంటలే.
పగలు అప్పుడప్పుడు ఎండ వెచ్చదనాన్ని ఇచ్చినా చలి విపరీతం.కనుక కొడై వెళ్ళేవాళ్ళు తప్పక స్వెటర్లు తీసుకువెళ్ళలి.తీసుకువెళ్ళకపోయినా లేక్ దగ్గర చాలా షాపులు వుంటాయి.బేరమాడి కొనుక్కొవచ్చు.దట్టంగా మచుకురుస్తుంటే చలి తట్టుకోలేము గాని మంచి మంచి అందాలు కొన్ని అప్పుడే బంధించగలం.మేము బస చేసిన కాటేజిలో వాడు రగ్గులు ఇచ్చినా అవి కూడా చల్లగా అయిపోయి ఆ చలి తట్టుకోలేక చచ్చా.
పొద్దున్నే లేచి మొహం కడుకుందామని బాత్రూంకి వెళ్ళితే ఆ గీజరు ఎలా ఆను చెయ్యాలో తెలియలేదు.ఎవరినైనా లేపుదామా అంటే అందరు మంచి నిద్రలో వున్నారు.సర్లే అని ఆ నీళ్ళు తీసుకొని మొహం కడుకొనేటప్పటికి నా మొహం తెల్లగా పాలిపోయింది ఆ దెబ్బకి.నాకు నచ్చిన విషయం ఎమిటంటే హోటల్లో మాత్రం తాగటానికి వేడినీళ్ళు ఇస్తారు.లేదంటే ఎమయ్యేవాడినో.

ఇది కొడై వెళ్ళే దారిలో.
వెళ్ళినరోజు పొద్దున్నే 5 గంటలకి కొడైలోకి అడుగుపెట్టి టీ తాగటంకోసమని డ్రైవర్ సుమో ఆపి డోరు తీసాడు అంతే చలి మొదలయ్యింది.ఆ డోరు మూసేదాక వూరుకోలేదు.ఇదంతా చదివి మరి చలి తట్టుకోలేని వాడివి అక్కడికి ఎందుకు వెళ్ళవు అనుకుంటున్నారా.ఎంత చలైనా నాకు కొత్త ప్రదేశాలు చూడాలంటే చచ్చేంత ఇష్టం అందుకు.

అదండి కొడై గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు.

4 comments:

తెలుగు వీర said...

చిన్నప్పుడు బాగా చలికి వణికేవాన్ని కొడైలోనే మొదటిసారిగా చలి అంటే నాకెంత ఇష్టమో తెలుసుకున్నాను. నేను చలికాలం వెళ్ళాను మరి. నాతో పాటు వచ్చిన తమిళ తంబి మాత్రం నా స్వెటరు, వాడి స్వెటరు, నా అదనపు చొక్కా ఇన్నీ వేసుకున్నా గజగజ

విశ్వనాధ్ said...

soooo super..
gooood photos...
keep posting.......

Ramya said...

ఆ మూడో ఫోటో లో మీరేనా?

విహారి(KBL) said...

తెలుగువీర గారికి,విశ్వనాథ్ గారికి నెనర్లు.రమ్యగారు ఆ ఫొటోలో నేను కాదండి.నాకు అప్పుడే పెళ్ళా.