Wednesday, November 28, 2007
మహబలిపురం
అందరికి నమస్కారం.మొన్న దసరాకి మా స్నేహితులు వస్తే మహబలిపురం వెళ్ళాం.ఆ విసేషాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం మమల్లాపురం.మమల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు.మహాబలిపురం చూడలేక పోతే జీవితంలో ఒక మంచి అనుభూతిని మిస్ అయ్యినట్లే.
చిన్నప్పుడు బళ్ళో చదువుతున్నప్పుడు మా పక్క ఊరి దియేటర్లో "బాలరాజు కధ" అనె సినిమా వస్తే పిల్లలికి తక్కువ ధర టికెట్తో సినిమాకి పంపించారు. ఆ సినిమాలో మొత్తం మహాబలిపురం అందాలు చూపిస్తారు.ఆ సినిమా చూసినప్పటినుంచి మహాబలిపురం చూడాలని ఆశ.అది ఇన్నళ్ళకి తీరింది.ఇప్పటికి ఆ సినిమాలోని "మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళా జగతికిది కొత్తగోపురం " అనే పాట అప్పుడప్పుడు హం చేస్తుంటాను.ఈ పాట పూర్తి లిరిక్స్ కోసం ఇక్కడ చూడండి.
మహాబలిపురానికి ఆ పేరు రావటానికి ఒక కధ వుంది.పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.తర్వాత పల్లవులకాలంలో ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది.పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు.అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద.పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు.దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
ప్రతిరాయికి ఒక రూపం కల్పించి ఆ ప్రాంతం మొత్తాన్ని శిల్పసంపదకు చిరునామా చేసారు.అందుకే ఇది యునెస్కో వారి జాబితాలో చేరింది.
మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు వున్నాయి.అక్కడినుంచి ఒక గంటన్నర రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు.సముద్రం ఒడ్డున శిల్పకళా నగరం నిజంగా అద్భుతమైన అనుభూతి.మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలొనే వుంటాయి.ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు.తెలీదని ఆటో లేదా టాక్సి ఎక్కారో మోసపోయినట్ట్లే.ఎందుకంటే మేము అలాగే ఎక్కాంకాబట్టి.
మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.మొదటివి మండపాలు,గోపురాలు,లైట్ హౌస్ ,బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం.ఇవి చూడటానికి,ఫొటొలకి టికట్ లేదు.పూర్తిగా ఉచితం.
ఇది బిగ్ రాక్ .ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది.ఇది ఒక విచిత్రం.ఇక్కడ ఒక చెట్టు వుంది.ఆ చెట్టు కి కాసే కాయలు మన చేయ్యంత వుంటాయి.
రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు.ఇవి చూడటానికి , ఫొటోలకి టికట్ తీసుకోవాలి.
మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్.ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి.సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది.ఇది కూడా చాలా దగ్గరే.బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.
ఆ తరువాత బీచ్ లో సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు.గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు.వేడి వేడి సీఫుడ్ లాగించొచ్చు.ఇక్కడ భొజనం హోటళ్ళకి,లాడ్జిలకి కొరతే లేదు.కాని రాత్రుల్లు స్టే చేసేంత అనువైన ప్రాంతంకాదు. తిరిగి చెన్నై వచ్చేయటం బెటర్.భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ కనిపిస్తారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఎన్నో ఆలయాలతో అలరారిన ఈ ప్రాంతం తరువాత సముద్రపు కోతవల్ల అన్నో అపురూపమైన శిల్పాలని , ఆలయాలని కోల్పోయింది. సముద్రగర్భంలో కలిసిపోగా మిగిలనివి ఇప్పుడు మనలని అలరిస్తున్నాయి.ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ప్రాంతం మహాబలిపురం.ఆ అనుభూతిని మిస్ కాకండి.
మళ్ళి మరో ప్రాంత విశేషాలతో మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు.
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
నేను పదవ తరగతిలో, మా స్కూల్ తరపున మహాబలిపురం చూశాను.. మళ్ళీ మీ టపా చదువుతుంటే, ఆ విషయాలన్నీ గుర్తుకువచ్చాయి...
మీ పొటోలు గాని పోస్టులు గాని అనీ చాలా బావుంటాయి.
నేనొకటి అడగాలనుకొంటున్నాను.
బ్లాగుల ద్వారా మీ పొటోలను కొందరే చూస్తున్నారు.
మరింతమంది చూసేలా,ఎప్పటికీ ఉండేలా
తెవికీలో ఉంచితే ఇంకా బావుంటాయని అనుకొంటున్నాను.
మీరు పర్మిషన్ ఇస్తే మీపేరుతో మీ పొటోలను వాడుకొంటాను.
ఇలాంటి పొటోలు ఎక్కువగా దొరకవు. మీరు ప్రత్యేకంగా తీసారు కనుక అడుగుతున్నాను. పొటోలు పలానా బ్లాగ్ నుండి సంగ్రహం అని మీబ్లాగ్ పేరు కూడా చేర్చవచ్చు.
మీరు మరికొంత పర్మిషన్ ఇస్తే కేవలం పొటోలే కాక పోస్టులోని బాగాలను కూడా వాడుకొంటాను.
మీ అభిప్రాయం తెలియజేయగలరు.
బాగుంది చక్కగా బ్లాగ్ కోసమే ఫొటో లు తీసినట్టున్నారు .నేను నాల్గేళ్ల కిందట వెళ్లాను,అక్కడ బీచ్ కూడా చాలా బాగుంటుంది,నీళ్ల మద్య రాళ్ల లోకి వెళ్లి ఆటలాడాం.నాదగ్గర అప్పటి C D వుంది.
మేధాగారు,రమ్యగారు నెనర్లండి.
విశ్వనాథ్ గారు మీరు నా టపాలని వాడుకోండి.కాని నా బ్లాగు నుండి సంగ్రహం అని వద్దు.
చక్కగా చాలా బాగుంది
మీ ఫొటోలు చాలా బాగున్నాయి విక్షనరీలోకి అప్ లోడ్ చెయ్యగూడదూ ఉపయోగంగా ఉంటాయి.
కొత్తబంగారు లోకం చాలా బాగుంది. రంగుల కలయిక,ఫాంటు ....అబ్బా....నిజం గా కొత్త లోకాన్ని చూస్తున్నట్టుంది ఆ హెడ్డర్ చూస్తుంటే
Post a Comment