Thursday, March 6, 2008

తంజావూరు విశేషాలు

అందరికి నమస్కారం.మరోసారి కొత్తబంగారు లోకానికి స్వాగతం.ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
శివరాత్రి సందర్భంగా అందరికి తంజావూరు విశేషాలు తెలియచేద్దామని వచ్చాను.తంజావూరు దక్షిణ తమిళనాడులోని ప్రాచీన పట్టణం.




కావేరి నదీ తీరాన వున్న ఈ పట్టణం ముఖ్యంగా బృహదీశ్వరాలయం వల్ల ప్రఖ్యాతి గాంచింది.నేను పుదుకొట్టైలో పిజి చేసేటప్పుడు మూడు సార్లు ఇక్కడికి వెళ్ళాను.




రాజరాజచోళుడు కట్టించిన ఈ ఆలయం యునెస్కొ వారి వారసత్వ సంపదల్లో ఒకటి.ఈ ఆలయంలో అతి భారీ శివలింగం మనం చూడవచ్చు. గుడి కెదురుగా భారి నందిని మనకు దర్శనమిస్తుంది.గుడిలొనికి వెళ్ళే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు తప్పక చూడవలిసిందే.గుడి దోపురం పెద్దగా ఉండటమే కాకుండా ఆ గోపురం మొన నీడ కింద పడకుండా కట్టటం దీని ప్రత్యేకత.ఒక శివరాత్రికి అక్కడికి వెళ్ళాం.అంత పెద్ద లింగానికి అభిషేకం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు.




ఇక్కడికి మనవాళ్ళే కాకుండా విదేశీయులు ఎక్కువగా వస్తారు.గుడిలో ఒక చెట్టు వుంటుంది.ఆ చెట్టుపై మూడు బల్లులని లెక్కపెట్టి మన కోరికలు కోరుకుంటే తెరతాయని అంటారు.

ఆలయం తరవాత చూడవలసింది కోట.తంజావూరిని పాలించిన రాజులకు సంబందించిన అన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు.నాట్యశాల,దర్బారు,కోట లోపల మ్యూజియం మొదలైనవి ఇట్టే ఆకట్టుకుంటాయి.మ్యూజియం లో ఒక భారి తిమింగలం అస్థిపంజరం కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు.శిమ్హాసనాలు,కత్తులు మొదలైనవి చూడవచ్చు.అందులో మనం కుర్చోవచ్చు.ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.





తంజావురు పైయింటింగ్స్ చాలా ఫేమస్.బంగారు పూత పూయబడిన ఈ పైయింటింగ్స్ ఖరీదు కూడా ఎక్కువే.తంజావూరు సంగీతానికి ప్రసిద్ధి .ప్రతి యేటా ఇక్కడ జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకి అనేక మంది వస్తారు.

తంజావురు వెల్లటానికి చెన్నై నుంచి బస్,రైలు సదుపాయలున్నాయి.తమిళనాడులోని అన్ని పట్టనాలనుంచి తంజావురు బస్సులు వుంటాయి.తిరుచ్చి అతి దగ్గరలో వున్న విమానాశ్రయం.అక్కడినుంచి బస్లో వెళ్ళోచ్చు.తంజావురు మెయిన్ బస్ స్టాండ్ ఊరి ఎంట్రన్స్లో వుంటుంది.అక్కడినుంచి లోకల్ బస్సులు వుంటాయి.

అదండి తంజావురు విశేషాలు అంతవరకు శెలవు.అందరికి మరొక్కసారి శివరాత్రి శుభాకంక్షలు.

8 comments:

ramya said...

తంజావూరు విశేషాలు బావున్నాయి. చాలా రోజుల తరువాత రాసారు. నేను మీ కొత్త బంగారు లోకం లోని కొత్త పోస్ట్ల కై ఎదురుచూస్తూ వున్నా.
తంజావూరు చెన్నై నుండి ఎన్ని కిలోమీటర్స్ దూరం లో ఉంటుంది? ఆ దారిలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏవైనా ఉన్నాయా?

Tulasi Ram Reddy said...
This comment has been removed by the author.
Tulasi Ram Reddy said...

తంజావూరు చరిత్రపై ఇటీవలే ఒక డాక్యుమెంటరీ చూసాను. అందులో తంజావూరు గురించిన ఎన్నో మరునపడిన రహస్యాలన్నింటినీ చాలా చక్కగా విడమర్చి చెప్పడం జరిగింది.

http://www.youtube.com/watch?v=pCHeeGpy4eo
http://www.youtube.com/watch?v=rVHQPWxmdAM
http://www.youtube.com/watch?v=BfhesYL_wp0
http://www.youtube.com/watch?v=jLRCFoQWuqM
http://www.youtube.com/watch?v=-DqBiL2t__U
http://www.youtube.com/watch?v=2zKCecWTWJo

విహారి(KBL) said...

నెనర్లు రమ్యగారు మరియు తులసి రాంరెడ్డిగారు.
తంజావురు చెన్నైనుంచి సుమారు 400 నుంచి 450 కి.మీ వుండొచ్చండి.చుట్టుపక్కల స్వామిమలై,కుంభకోణం మొదలైన ప్రాంతాలు ఆలయాలు చూడొచ్చు.వాటి గురించి వీలైనప్పుడు రాస్తాను.అందరికి మరొక్కసారి నెనర్లు.

విశ్వనాధ్ said...

చాలా రోజుల తరువాత మంచి విషయాలతో వచ్చారు. ముఖ్యంగా విషయాలతో పాటు మీరు అందించే చిత్రాలు మరీ బావుంటాయి. మరొక పోష్టు కోసం ఎదురు చూస్తాం.

రాధిక said...

చాలా రోజుల తరువాత వచ్చారు.చాలా విషయాలతో,విశేషాలతో సమగ్రం గా టపాలు అందిస్తున్నారు.నెనర్లు.

విహారి(KBL) said...

విశ్వనాధ్ గారు,రాధిక గారు అందరికి మరొక్కసారి నెనర్లు.

Kommireddi Pavan said...

విహారి గారు...
మీ తాంజావూరి విశెషాలు చాలా బాగున్నాయి..నా గతాన్ని తట్టి లేపాయి...
నేను కుడా తాంజావూరు లో బాగా గడిపాను...ఆ కట్టడాలు, ఆ చారిత్రిక వైభవం అద్భుతం కదా..వాటన్నిటిని కళ్ళకి కట్టినట్టు చూపించారు...మిక్క నన్రి ...!!
మీరు మీ విశేషాలలో మరిచిపోయినదాని గురించి చెప్తాను..
మన హిందూ శాస్త్రాలలో "గోపురం నీడ పడితె అక్కడ పచ్చగా ఉందదు " అంటారు...అంటే గోపురం నీడ నేల మీద పడితే ఆ ప్రదేశం మంచిది కాదు అని అర్ధం కాబోలు.. అందుకని తాంజావూరి బ్రిహదీశ్వరాలయం గోపురం నీడ కింద పదకుండా జాగ్రత్త పడ్డారంట..అంటే ఆ గోపురం నీడ sunlight ఎంత inclined గా వచ్చినా కింద పడదంట...అప్పట్లోనే architectural miracles చూపించారన్నమాట...