పల్లె కన్నీరు పెడుతోంది...
బీడైపోయిన నేలను చూసి
'సెజ్'ల పాలైన పంటచేలను చూసి
కబేళాలపాలైన గోమాతలను తలచి
అప్పులపాలైన అన్నదాతను చూసి
ఉరికొయ్యలపాలైన నేత కార్మికులను తలచి
వలసపోయిన జనాలను తలచి
బోసిపోయిన ఉమ్మడింటిని చూసి
మమ్మీ డాడీలైపోయిన అమ్మానాన్నలను తలచి
పాడిపంటలతో,పసిడిరాశులతో
ఉమ్మడికుటుంబాలతో,ముంగిటముగ్గులతో
ఆత్మీయత నిండిన పలకరింపులతో
అలరారిన తన గత వైభవాన్ని తలచి
భవిష్యత్తు మీద బెంగతో
పల్లె కుమిలి కుమిలి కన్నీరు పెడుతోంది
5 comments:
ఇది ఏదో సినిమాలో విన్నట్టు గుర్తు.కానీ సాహిత్యం కొంత వేరే అనుకుంటాను.ఆ పాట తరువాతే నాకు విప్లవ సాహిత్యం మీద,సినిమాల మీద కొంత ఆశక్తి కలిగింది.పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఎదేమైనా ఉన్నవిషయం చెప్పారు. బాగానే వుంది.
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...కుబుసం సినిమాలోని పాట....ఈ కవిత వేరు...కవిత కూడా బాగుంది పాట లాగే
మీర్రాసింది నిజం.
ఇంకా ఇలాగ రాస్తూ ఉండాలి మీరు.
చాలా బావుంది.
ఇది చదవగానే నేను రాసిన కవిత కూడ గుర్తొచ్చింది.
-- విహారి
Post a Comment