భారతదేశంలో నెంబర్ వన్ గాయకురాలు లతామంగేష్కర్ చేత తెలుగు పాట పాడించిన సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో తనకొక ప్రత్యేక స్థానాన్ని తొలి చిత్రం నుండే సంపాదించుకున్నారు. ఘంటసాల, రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతున్న సమయంలో ‘సంసారం’, ‘సంతానం’, ‘ఇలవేల్పు’ వంటి చిత్రాలకు విలక్షణమైన తన సొంత బాణీలో సంగీతం సమకూర్చి సుసర్ల తన ప్రత్యేకతని చాటుకున్నారు.
అందరు వినియోగించే రాగాలనే ఒక భిన్నమైన కోణంలో వినియోగిస్తూ పాటలకి బాణీలు సమకూర్చడం సుసర్ల శైలిలో ప్రత్యేకత. ‘సంసారం’ చిత్రంలో ‘శివరంజని’ రాగంలో ఆయన స్వరపరచిన ‘చిత్రమైనది విధి నడక’లో పల్లవి, మూడు చరణాలలోను ‘విర్రవీగుట వెర్రి కాని’, ‘తల్లితండ్రి గురువుతానై’ తప్పునా సామాన్యులకు’ వంటి సాహిత్య సంబంధమైన ఎగుడుదిగుడులు సంగీతంలో చాలా ప్రమాణాత్మకంగా నిర్వహించి సుసర్ల ధన్యులయ్యారు. ఈ మాటల్ని ఆయన ఎలా పాడించారో పాట ఒకసారి వింటే అర్థమవుతుంది. అలాగే ‘సంసారం’ చిత్రం టైటిల్ సాంగ్ ‘సంసారం సంసారం ప్రేమసుధా పూరం నవజీవన సారం’, ‘సంతానం’ చిత్రంలో ‘చల్లని వెనె్నలలో’ పాటలు కల్యాణి రాగాన్ని ప్రయోగాత్మకంగా ఒక భిన్న కోణంలో సుసర్ల వినిపించారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో భీంపలాసి (అభేరి) రాగంలో స్వరపరచిన ‘చల్లనిరాజా ఓ చందమామా’ అలాగే‘్భపాల’రాగంలో స్వరపరచిన ‘కనుమూసినా కనిపించే నిజమిదేరా.’ ‘నర్తనశాల’ చిత్రంలో ‘నాట’ రాగంలో స్వరపరచిన ‘జనగణ నాయక’ (బిలావల్) (శంకరాభరణం) రాగంలో స్వరపరచిన ‘సరసాలు పులకింప’ పాటలు కూడా స్వరకల్పనలో ఆయన విలక్షణతకి చక్కని ఉదాహరణలు. రొటీన్‌గా రాగాలలో వచ్చే ప్రేజెస్ కూకుండా భిన్నమైన ప్రేజెస్ వాడడం, పాట ఎత్తుబడిలో భిన్నత్వం సుసర్ల సృజనాత్మకతకి, విలక్షణతకి గుర్తు. పాటని జాగ్రత్తగా వింటే గాని రాగాన్ని గుర్తుపట్టడం కష్టం. సుసర్లకి హిందుస్తానీ సంగీతంలో మంచి పట్టు ఉందనడానికి చక్కని ఉదాహరణలు. ‘సంతానం’ చిత్రంలో లత పాడిన ‘నిదురపోరా తమ్ముడా’, ‘నర్తనశాల’ చిత్రంలో ‘సఖియా వివరించవే’, ‘సరసాలు పులకింప’ పాటలు. ‘నిదురపోరా తమ్ముడా’ పాట పల్లవి, మొదటి చరణం ‘ఖమాజ్’ (హరికాంభోజి) రాగంలో స్వరపరచి అందులోంచి బసంత్ ముఖారి రాగంలోకి జారి (గ్లిదిన్ జి) ‘జాలి తలచి కన్నీరు తుడిచే’ ‘బసంత్ ముఖారి’ రాగంలో పాడి మళ్లీ ఖమాజ్లోకి జారడం ఒక చక్కని ప్రయోగం. అలాగే ‘గోరఖ్ కళ్యాన్’ రాగంలో స్వరపరచిన ‘సఖియా వివరించవే’ బసంత్ ముఖారిలో స్వరపరిచిన ‘సరసాలు పులకింప’ సుసర్ల ప్రయోగసీలతకి, సృజనాత్మకతకి, విలక్షణతకి చక్కని ఉదాహరణలు. సుసర్ల మనం మరచిపోయిన మధుర గాయకుడు రఘునాథ్ పాణిగ్రాహి చేత ‘ఇలవేల్పు’లో చక్కని పాటలు పాడించారు. ‘చల్లని రాజా ఓ చందమామ’ పాటలో మూడవ వంతు మాత్రమే పాడినా పాణిగ్రాహి తనదంటూ ఒక ముద్ర వేయగలిగారు. ఆయన పాడిన ఏనాడు కనలేదు ‘నీ వంటి సుందరి’ చాలా మంచి పాట. సుసర్ల సంగీత జీవితంలో మైలురాయి ‘నర్తనశాల’. ఈ చిత్రంలో ‘సలలిత రాగ సుధారస సారం’, ‘జనని శివకామిని’ (దర్బారీ కనడ) ‘నరవరా ఓ కురువర’ (అసావేరి/నట భైరవి) వంటి పాటలు ‘్ధన్యాసిరాగంలో’ సుశీల పాడిన ‘హే గోలక’, ‘కల్యాణి’ రాగంలో ఘంటసాల పాడిన ‘ఎవ్వాని వాకిట’ వంటి పద్యాలు ఈనాటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి.
చలనచిత్ర సంగీతం వాద్య గోష్టి (ఆర్కెస్ట్రేషన్)లో ఒక కొత్త వరవడి సృష్టించిన ముంబై సంగీత దర్శకుడు శంకర్ (శంకర్, జైకిషన్ జోడిలో ఒకరు)తో కలసి పనిచేయడంవల్ల సుసర్ల వాద్యగోష్టి కూడా ప్రత్యేకతని సంతరించుకుంది అనడానికి ‘సరసాలు పులకింప’, ‘సఖియా వివరించవే’‘ పాటలే నిదర్శనం.
సంగీత జ్ఞానం, సృజనాత్మకత, ప్రయోగశీలత్వం, ఒరిజినాలిటీ వంటి లక్షణాలన్నీవున్నా బహుశా కర్మఫలమేమో చక్రవర్తి వంటి సంగీత దర్శకుడి వద్ద దక్షిణామూర్తిగారు వయొలెనిస్ట్గా పనిచేయాల్సి వచ్చింది. చిత్రమైనది విధి నడక (సంసారం చిత్రంలోని పాట).
ఈరోజు సుసర్ల దక్షిణామూర్తిగారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన సృజించిన పాటలవల్ల ఆయన చిరంజీవే!
No comments:
Post a Comment