ఈ క్షేత్రం బనగానపల్లి నుంచి 10 కి.మీ, నంద్యాల నుంచి 50 కి.మీ దూరంలో ఉన్నది.
అందమైన ఎర్రమల కొండల్లో అలరారుతున్న పుణ్యక్షేత్రం యాగంటి. అగస్త్య మహాముని తపస్సుకి మెచ్చి ఇక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవి సహితంగా ఏకశిలపై వెలిశారు.
ఎర్రమల కొండలు
ప్రధాన ఆలయ గోపురం
ఎర్రమల కొండలనుంచి వచ్చిన నీరు ఇక్కడ కొనేరుగా ఏర్పడింది. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి వాడతారు.
కింద బొమ్మలో ఉన్నది వెంకటేశ్వర గుహ.అగస్త్య మహాముని ప్రతిష్ఠించ తలపెట్టిన వెంకటేశ్వరస్వామి విగ్రహం పాదముయొక్క గొరు విరిగి పోవుటచే ప్రతిష్టకి అనర్హముగా భావించి ఈ గుహలో భద్రపరిచారు.
ఈ క్షేత్రంలో శనికి , కాకులకి ప్రవేశం లేదు. దానికి సంబందించిన వివరాలు కింద ఉన్న బొమ్మలో చూడొచ్చు. బొమ్మమీద క్లిక్ చేయండి.
కింద ఉన్నదే అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ. దీనినే రోకళ్ళ గుహ అంటారు.
ఈ గుహలో ఉన్న శివలింగం ముందు నూనె దీపం పెడితే శని ప్రభావం ఉండదని నమ్మకం.
కింద బొమ్మలో ఉన్నది శంకర గుహ.ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన శిష్యులకి జ్ఞానోపదేశం చేశారని చెప్తారు.
యాగంటి నందికి సంబందించిన విశేషాలు కింద ఉన్న బొమ్మలో చూడొచ్చు. బొమ్మమీద క్లిక్ చేయండి.
ఇదే యాగంటి నంది
మరిన్ని వివరాలకు ఈ కింది బొమ్మల మీద నొక్కి చూడండి.
No comments:
Post a Comment