Saturday, August 11, 2007

ఆరుకులోయ --- ప్రయాణం

అరుకు వెళ్ళలంటే రెండు మార్గాలు వున్నాయి.
ఒకటి రైలు ,రెండు బస్ ప్రయణం.
అన్ని అందాలు కవర్ చెయ్యాలంటే వెళ్లేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది.


ట్రైన్ వైజాగ్ లొ ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి.అది అలా కొండల ,లొయలు,గుహలు దాటుకుంటు సాగిపొతుంది.ప్రయణం సుమారు 5 గంటలు వుంటుంది.ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము.ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది.అది ఇండియా లొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు.


ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి.అక్కడ దిగి బొర్రా గుహలు చుసుకొని అరుకు వెల్లవచ్చు.లేదంటే తిరుగు ప్రయాణం లొ చుడవచ్చు.
అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జులు,గెస్ట్ హౌస్లు,కాటెజ్ లు వుంటాయి .

ప్రభుత్వ పున్నమి రిసార్ట్స్


సాంప్రదాయ కాటేజ్ లు


ఇక చూడవలసిన ప్రదేశాలు
1.బొర్రా గుహలు
2.పద్మాఫురం గార్డెన్స్
3.ట్రైబల్ మ్యూజియం
4.చాపరాయి
5.మత్స్య గుండం
6.తైద జింగెల్ బెల్స్
ఇవి ముఖ్యమైనవి .ఇవి కాకుండ చుట్టు పక్కల చిన్న ,చిన్నవి కొన్ని వున్నాయి.

ప్రయాణానికి అనువైన సమయం

మొత్తం సవత్సరం లొ ఎప్పుడైన వెళ్ళవచ్చు .
వేసవిలొ వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకొవొచ్చు .
శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్ని పసుపు వర్ణం తొ అందంగా తయారవుతాయి.అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి.


ఇక వర్షాకాలం ఐతే పచ్చదనం తొ కళకళలాడిపొతుంది.అప్పుడు వెళ్ళేవాళ్ళు రైన్ కోట్లు,గొడుగులు పట్టికెళ్ళటం మంచిది.
షాపింగ్:
గిరిజనులు తయారు చేసే వస్తువులు అవి అమ్ముతారు .
గిరిజనాబివ్రుధి సమస్థ అమ్మే స్వచ్చమైన తేనె మోదలైనవి కొనవచ్చు.

తిరుగు ప్రయణం:
బస్ జర్ని మంచిది.లేదంటే ఒక జీప్ మట్లదుకుంటే అన్ని చూడవచ్చు. వచ్చే దారిలొ తైద లొ జింగెల్ బెల్స్,కాఫి ప్లాంటెషన్స్ లాంటివి చూడవచ్చు .

ఫొటొలు గొ2ఇండియా,విసాఖ.ఆర్గ్ వారి సౌజన్యంతొ

మళ్ళి కలుస్తానండి
మీ విహారి

2 comments:

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

బాగుందండీ విహారి గారూ..!! అరకు వెళ్ళొచ్చినట్లే ఉంది. ఈ సారి India Trip లో తప్పనిసరి గా ప్లాన్ చేస్తాను.

రాజారావు తాడిమేటి

Viswanadh. BK said...

మీ ఆర్టికల్ బాగుంది.పొటోలు కూడా!
నేనుకూడా చూడ్డానికి వెళ్ళాలి.ఇంతవరకూ చూడటం పడలేదు.