అందరికి నమస్కారం.
ఆనలుగురు ఎవరు?ఎమిటి విషయం అనుకుంటున్నారా?ఆనలుగురు గురించి చెప్పేముందు కొన్ని విషయాలు చెప్పాలి.కొత్తగా ఆ వూరికి వచ్చినమాకు వాళ్లే పెద్దదిక్కు అయ్యారు.అన్ని వేళలా మాకు సహాయపడుతూ మమ్మలిని తమ సొంత మనుషులుగా చూసుకున్న ఆనలుగురికి ఈ టపా అంకితం ఇస్తున్నాను.
అది మేము కాలేజ్లో జాయిన్ అవ్వటానికి వచ్చిన రోజులు.అంతా కొత్త.కొత్త ఊరు,భాష తెలీదు,ఎవరితో ఎమి మాట్లడాలో తెలీదు.ఒక కన్సల్టన్సి ద్వారా అక్కడికి వెళ్ళాం.కాలేజో సీట్ ఐతే దొరికింది కాని వుండటానికి హాస్టల్లో సీటు దొరకలేదు.చాలా మంది స్టూడెంట్స్ బయటే రూములు తీసుకుని వుంటారు.ఎలాగైతే మాకు ఒక ఇల్లు దొరికింది.అది ఇల్లుకాదు పొదరిల్లు.మంచి మనుషుల వున్న మమతలకోవెల.ఏంటి కపిత్వం ఎక్కువైందా.సరే అది వేరే ఎవరొ కాదు మా కాలేజ్ అడ్మినిస్టేట్ అఫీసర్ గారి ఇల్లు.టైటెల్ లొని ఆనలుగురు లోని ఇద్దరే ఆయన తల్లితండ్రులు.ఆయన రిటైర్డ్ ఎస్ పి.ఆవిడ గ్రుహిణి.చెప్తున్నానని కాదుగాని మమ్మల్ని సొంత పిల్లలాగ చూసేవారు.పండగలు,పబ్బాలు అందరం కలిసి చేసుకొనేవాళ్లం.మాకు ఎవరికి ఒంట్లొ బాగుండకపొయినా వేడినీళ్ళని,అవని ఇవని ఎదో సయం చేస్తునేవుండేవాళ్ళు.మేము ఇంటికి దూరమయ్యామని తెలీకుండా వుండటంకోసం తెలుగు ఉగాది అని వేరే పండుగలని మాకొసం పిండివంటలు అవి చేసి ఇచ్చేవాళ్లు.ఇక కాలక్షేపానికి వాళ్ళ పాత బ్లాక్ అండ్ వైట్ టివి మాకు ఇచ్చారు.మా అద్రుష్టమెంటంటే పక్క ఇంట్లొ ఎవరు వుండరు.ఇదివరుకు వున్నవాళ్ళు వాడిన కేబుల్ వైరు అలాగే వుండేది.అది పెట్టుకుని సినిమాలు,తమిళ చానల్స్ చూసేవాళ్ళం.ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి మా కోసం ఎదురు చూసేవాళ్ళు.మాది పై పోర్షన్ .వాళ్ళు కింద వుండేవాళ్ళు.మేము వస్తే గాని గేట్ వెసేవాళ్ళు కాదు.అందరు వచ్చారలేదొ కనుకుని అప్పుడు గేట్ వేసేవాళ్ళు.లెకపోతే మాకొసం ఎదురు చూసేవాళ్ళు.ఇంకా చాలా సంగతులు వున్నయి కాని ప్రస్తుతం గుర్తురావటం లేదు.
మిగిలిన ఇద్దరు లొ ఒకతని పేరు నాగరాజన్.అసలు తమిళనాడు లో సాయంత్రం భోజనం వుండదు.అంతా సాయంత్రం టిఫిన్సే.ఎక్కడో చెన్నై లాంటి కొన్ని చొట్ల అది అంధ్రా మెస్సుల్లొ మాత్రమే వుంటుంది.పైగా తమిళ్ నాడులో హోటెల్స్ లో అన్నం కూడా అంత బాగోదు.అలాంటి చొట మాకు రెండు పూటలా అన్నం పెట్టిన మనిషి.నెలకి వెయ్యి రూపాయలికి పొద్దున్న టిఫిన్,రెండు పూటలా భొజనం పెట్టేవాడు.
ఇక ఈ వరసలో చివరే కాని మా మనసుల్లో కాదు.అతని పేరు వీరాస్వామి.అతను అక్కడి గవర్న్మెంట్ బస్ కండక్టర్.అసలు అతను ఎల పరిచయమో కుడా గుర్తులేదు.మాకు బస్లో ఎప్పుడు తగలలేదు.మా సీనియర్స్ ద్వారా పరిచయం అనుకుంట.తమిళుడైనా,వయసులో పెద్ద ఐనా మా స్నేహానికి భాష కాని,వయసుకాని అడ్డురాలేదు.అసలు మేమంటే ఎంత అభిమానమో చెప్పలేను.రెండుసార్లు ఇంటికి పిలిచి భొజనం పెట్టారు.ఎప్పుడు ఎవొ ఒకటి తెస్తూ వుండేవారు.అంత మంచి మనిషి నేను మళ్ళి చూడలేదు.నేను చేసిన తప్పు నంబర్ తీసుకొవకపోవటం.ఈ మధ్య ఎలగో ఒక నంబర్ సంపాదించి కాల్ చేస్తే ఎవరో కయ్యిమని లేచారు.రాంగ్ నంబర్ అనుకుంట.పర్లేదు ఎప్పుడొ ఒకప్పుడు మళ్ళి కలుస్తానని నాకు నమ్మకం వుంది.ఆనలుగురికి నా బ్లాగు తరుపున,నా తరుపునా ధన్యవాదాలు.
5 comments:
మేలుచేసిన వారిని ఎప్పుడూ మరచిపోకూడదు.
మీ స్నేహితులను గుర్తుంచుకోవడమేకాక వారిని నలుగురికీ
పరిచయం చేయడం{బ్లాగ్ ద్వారా}చాలా బావుంది.
True, affection and help come from most unexpected sources. Beautiful and poignant. Thanks for sharing.
వాళ్లని ఇలా తలచుకుని కృతజ్ఞత తెలుపుకున్నారు.ఎవరికన్నా అంతకన్నా కావలసింది ఏముంటుంది.వాళ్లని మీరు త్వరలో కలవాలని కోఉకుంటున్నాను.
విశ్వనాథ్ గారికి,కొత్తపాళి గారికి,రాధిక గారికి నా ధన్యవాధాలు.
మన నుండి ఏమీ ఆశించకుండా మనకి సహాయపడగలిగిన వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు.. మీ ఆత్మీయులని తలచుకోవడం, అంతే కాక, బ్లాగు ముఖంగా మా అందరికీ తెలియజేయడం ముదావహం..
Post a Comment