Monday, September 17, 2007

పరవై మునియమ్మ పాట పాడితే

ఈ టపా రాయటానికి ముఖ్యకారణం తమిళ గ్రామీణ కొయిలమ్మ పరవై మునియమ్మ గురించి వివరించటానికి.తెలుగు బ్లాగులో అరవ గోల ఎంటి అనుకుంటే మీ ఇష్టం చదవక్కరలేదు.


పరవై మునియమ్మ తమిళ జానపద పాటల్లో ఒక మెరుపు.మదురై సమీపంలోని "పరవై" ఆమె ఊరు.పల్లెసీమల్లో పెరగటం వల్ల ఆమెకు చిన్నపటినుంచి పాటలంటే ప్రాణం.అందరిలాగే ఎదొ పాడుతున్న ఆమె భర్త ప్రోత్సాహాంతో కచేరీలు చేసేది.అలా తెలుగులో బంగారం సినిమాకి దర్శకత్వం వహించిన ధరణి కంట్లో పడి విక్రం నటించిన ధూల్(తెలుగులో రవితేజా నటించిన వీడే సినిమాలో తెలంగాణా శకుంతల పాత్ర)సిన్మాలో పాత్ర చేసే అవకాశం పొందింది.



ఆ సినిమాలో అమె పాడిన పాట విన్న తమిళజనం ఆ గొంతు విని ఊగిపోయారు.అది గంభీరమైన గొంతు.పక్కా మాస్ జానపదాలు కలిసిన పాటలకు పెట్టింది పేరు పరవై మునియమ్మ.నిండైన కట్టుతో,నుదిటున రూపాయి బిళ్ళంత బొట్టుతో అచ్చమైన తమిళ పాటి(బామ్మ)లా వుండే మునియమ్మ ఇప్పటికి 30 సినిమాలలో నటించారు.ఏ సినిమాలో ఐనా తన పాట తనే పాడుతూ జనాలని అలరిస్తున్నారు.ఇప్పుడు చెవులకే కాదు సన్ టివిలో వచ్చే వంటల కార్యక్రమంలో గ్రామీణ వంటకాలతో ప్రేక్షకుల కంటికి కూడా విందు చేస్తున్నారు.ఒక పక్క వంట వండుతూ బోనస్ గా పాటలు కూడా వినిపిస్తారు.



ఇంతకి ఆమె వయసు ఎంతో తెలుసా ? 67 ఏళ్ళు.ఈ వయసులో కూడా జనాలని తన పాటలతో,నటనతో అలరించే పరవై మునియమ్మ నిజంగా గ్రేట్.పరవై మునియమ్మ పాట పాడితే జనం పాదం కదపరా.

1 comment:

మేధ said...

ఒకసారి యాడ్ చూసినట్లు గుర్తు ఈమె కార్యక్రమం పైన..
ఎక్కడ ఏ విషయం అయినా తెలుసుకోవడం ముఖ్యం.. అంతే కానీ దాంట్లో కూడా ఇది తమిళ విషయం, అది తెలుగు విషయం అని తేడాలు ఉండవులెండి..