అందరికి నమస్కారం.ఏంటో కొత్త టపాలు వేద్దామంటే సమయం చిక్కటం లేదు.ఆణిముత్యాలు బ్లాగు మీద శ్రద్ధ ఎక్కువై ఇందులో టపా వెయ్యటం కుదరటం లేదు.సరే మన టపాలోకి వచ్చేస్తున్నా.కొడైలో చలి తట్టుకోవటం నా వల్ల కాలేదు.నేను వేడి తట్టుకుంటాను గాని చలి అసలు తట్టుకోలేను.వెళ్ళిన దగ్గరనుంచి వచ్చే దాక నా పల్లు పట పట కొట్టుకుంటూనే వున్నాయి.
కొడై సరస్సు 5 కి.మీ విస్తీర్ణం కలిగి వుంటుంది.దాని చుట్టూ కాలి నడకన తిరిగేందుకు 45 నిమిషాలు పడుతుంది.ఇది బస్ స్టాండు నుండి 3 కి.మీ దూరంలో వుంది.వేరా లెవింజ్ అనే ఒకప్పటి మదురై కలక్టర్ తన సొంత డబ్బుతో దీనిని కట్టించాడు.ఇది మొత్తం 60 ఎకరాలలో వ్యాపించి వుంది.ఇది వరకు 11.5 మీటర్ల లోతు వుండే ఈ సరస్సు ఇప్పుడు 9 మీటర్లకి కుచించుకు పోయింది.సరస్సులో విహరించటానికి కొడైకెనాల్ బోట్ క్లబ్ & రోయింగ్ క్లబ్ మరియు తమిళనాడు టూరిజం డెపార్ట్మెంట్ వాళ్ళు బోట్లు ఏర్పాటు చేస్తారు.వాటికి 20 నుండి 125 రూపాయల వరకు వసూలు చేస్తారు.
లేక్ దగ్గరే స్వెటర్లు,మొదలగునవి అమ్మే షాపులు వుంటాయి.ఇక్కడ సైకిళ్ళు అద్దెకి ఇస్తారు.అవి తీసుకొని కొడై అంతా తిరగొచ్చు.
ఇక్కడే గుర్రాలు కూడా వుంటాయి ఆసక్తి వున్నవాళ్ళు పిల్ల గుర్రంపై సరస్సు చుట్టు తిరిగితే 100,సగం రౌండ్ కైతే 50 వసూలు చేసారు.ఇప్పుడు ఎంతో నాకు తెలీదు.బోటింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు అనుమతిసారు.ఇక్కడే ఒక పార్కు కూడా వుంది.దాని పేరు బ్రయంట్ పార్క్ అనుకుంట సరిగా గుర్తు లేదు.చాలా అందంగా వుంటుంది.
ఇంకా సరస్సు దగ్గరే రకరకాల చిప్స్,తాజా కేరెట్లు,వేడి వేడి తినుబండారాలు అమ్ముతారు.
కొడై కి సంబంధించిన మరిన్ని సంగతులతో మళ్ళి కలుస్తాను.అంతవరకు శెలవు.
4 comments:
బావుంది మీ కొడై ట్రిప్.ఫొటొస్ బాగున్నాయి. మేము కొడై వెళ్ళినపుడు అక్కడ పెద్ద వర్షం ఏ అనుభూతి లేకుండానే తిరిగొచ్చాం.
yours blog is really nice..i visited kodaikanal.its a nice place.u explained it very well.
ఈ సైకిల్స్ విషయం బాగుంది ఈసారి మేం వెళితే ట్రై చేస్తాము.
రమ్యగారికి,లావణ్య గారికి నెనర్లు.
Post a Comment