Sunday, October 28, 2007

కొడైకెనాల్ విహారం(ముగింపు)



కొడైకి వెళటానికి చెన్నై వెళ్ళి అక్కడనుంచి దిండిగల్ కాని మదురైగాని చేరుకుంటే అక్కడినుంచి సులువుగా చేరుకోవచ్చు.కొడైకెనాల్కి అతి దగ్గర రైల్ స్టేషన్ కొడైరోడ్.ఇది కొండ దిగువున వుంటుంది.ఇక్కడనుంచి 60 కి.మీ దూరం ఘాట్ రోడ్లొ ప్రయాణిస్తే కొడైకెనాల్ చేరుకోవచ్చు. అతి దగ్గరలోని విమానాశ్రయం మదురైలో వుంది.ఇక్కడనుంచి కొడై సుమారు 100 కి.మీ వుంటుంది.




కొడైలో ప్రధానమైన టూరిస్ట్ సీజన్ మే,జూన్.కనుక ఈ నెలల్లో వెళ్ళేవాళ్ళు ముందుగా రూము బుక్ చేసుకోవటం మంచిది.అన్ని తరగతులవారికి తగినవిధమైన కాటేజ్లు,హోటెళ్ళు ఇక్కడ వున్నయి.గ్రీన్ లాండ్స్ యూత్ హాస్టల్ ఎంతో అందమైన ప్రాంతంలో,ప్రసాంతమైన ప్రదేశంలో వుంటుంది.మిగతా వాటితో పొలిస్తే కొంత ఖరీదు తక్కువ కూడా.దీనికన్న తక్కువ ధరలో కూడా గదులు లభించే రిసార్ట్లు వున్నాయి.కొడైలో గోల్ప్ కోర్ట్ కూడా వుందండి.

కేరళలోని మున్నార్ కి కొడైకెనాల్ కి కొంత సామీప్యం వుంది.అదే 12 సంవత్సరాలకొక సారి పూసే నీలకురింజి పూలు.నీలి రంగులో చిన్నగా వుండే ఈ నీలికురింజి పువ్వు పుష్కరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది.అప్పుడు కొండలన్ని నీలి వర్ణం పులుముకుని మైమరపిస్తాయి.




ఇవి కొడైలో కంటే మున్నార్ లొ ఎక్కువగా పూస్తాయి.అప్పుడు కొడైగాని,మున్నార్ కాని నీలి అందాలతో మనసును కట్టిపడేస్తాయి.నాకు తెలిసి రెండు ,మూడు సంవత్సరాల క్రితం ఈ పూలు పూసాయి.మళ్ళి ఆ పూలు చూడాలంటే కొన్నాళ్ళు ఆగాలి.




కొడైలో లభించే హోం మేడ్ చాక్లెట్లు తప్పక రుచిచూడవలసిందే.ఇవి కొడై ఎక్కడైనా మీకు దొరుకుతాయి.ప్రతి వీధిలో ఈ షాపులు వుండాలిసిందే.కొడైలో కోతులు కూడా ఎక్కువే.




దానికి తగ్గట్టు ఈ ఫొజులు చూడండి.కోతి చేష్టలు అంటే ఇవేనేమో.



అన్నట్లు చెప్పటం మరిచాను కొడైలో ఐస్ క్రీం షాపులు కూడా వున్నాయండి.నేను తినలేదు మీరు వెళితే ట్రై చెయ్యండి.ఈ కోతి చూసారా ఐస్ క్రీం లాగించేస్తుంది.




అదండి కొడై గురించిన విశేషాలు.అందరికి నచ్చాయని ఆశిస్తూ మళ్ళి ఇంకో విహారయాత్రా విశేషాలతో మళ్ళి కలుస్తాను.అంతవరకు సెలవు.

5 comments:

ramya said...

బావుంది కొడై ట్రిప్,
ఎంతైనా హిల్ స్టేషన్స్ గొప్పగా వుంటాయి కదా!నేచర్ ని చూడాలంటే ఇక్కడే చూడాలి.

విశ్వనాధ్ said...

మొత్తం అన్ని భాగాలు దేనికదే అద్భుతంగా అందించారు.
ఫొటోలైతే మరీ బావున్నాయి. మరిన్ని యాత్రా కధనాలకోసం
ఎదురు చూస్తుంటా...

Vamsi Krishna Karthik Valluri said...

sorry 4 late reply..updated my blog andi..u can see it now..

ramana said...

http;//nijamga-nijam.blogspot.com

హృదయ బృందావని said...

విహారి గారు! దీపావళి శుభాకాంక్షలు :)

ఈసారి నేనే ముందు చెప్పాను పండుగ శుభాకాంక్షలు :)