Wednesday, May 12, 2010

అమర గాయకుని అర్ధాంగిప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీమూర్తి వుంటుంది అన్న మాటకు అక్షరసత్యంగా నిలిచినవారు సావిత్రమ్మ. గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అర్ధాంగిగా ఆమెకు కళాలోకం నీరాజనాలు పడుతోంది. మహాగాయకుడు ఘంటసాల వారి సతీమణిగా, అద్భుత గాత్ర పరిమళానికి ప్రధమ శ్రోతగా, ఆయన తదనంతరం ఆయనకు దక్కాల్సిన సన్మాన సత్కారాలన్నీ అందుకుంటూ, తన భర్తను నిత్య వసంతునిగా చేస్తున్నారు. ఆంధ్రదేశంలో ఘంటసాల గానామృతాన్ని సేవించనివారు వుండరు. పాడితే ఘంటసాలే పాట పాడాలని సువర్ణ్ధ్యాయంగా భావించే పాతతరం చిత్రాల్లో పట్టుపట్టి మరీ ఆయనచే పాడించేవారు. నిరంతరం రికార్డింగులు, మ్యూజిక్ సెట్టింగ్‌లు వగైరాలతో తిరిగే ఆయన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఆ అమృత గానఝురిని నేల నాలుగు చెరగులా ప్రవహించడానికి తనవంతు ప్రయత్నంగా కృషి చేసిన సావిత్రమ్మ జీవితం ధన్యం. అటువంటి వ్యక్తిత్వాన్ని ఘంటసాల అభిమానులకు పరిచయం చేస్తుందీ గ్రంథం. ‘అమరగాయకుని అర్థాంగి’ పేరిట శ్రీమతి ఘంటసాల సావిత్రి జీవిత ప్రస్తానాన్ని చూపుతుందీ పుస్తకం. ఘంటసాల గానసభనుండి వెలువడిన ఈ గ్రంథాన్ని డా.కె.వి.రావు రచించారు. ముందుగా ఘంటసాలవారి వాక్కుకు వున్న శక్తిని తెలియజేసారు. ఆయన ఏది మాట్లాడితే అది జరిగేదట. భవిష్యత్తులో తనలా పాటలు పాడే గాయకులు తెలుగు సీమలో పుట్టి, గానకళను అజరామరం చేస్తారని ఆయన ఆనాడే ఊహించారట. ఆ నోటి చలవనే నేటి కాలంలో ఎంద రో గాయకులు ఆయన పాటలు పాడి జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అటువంటి గాత్రం మరి ఇంతవరకు రాలేదని పరిశీలకులు నిర్ణయించారు. తన తరువాత వారసుడు ఎస్.పి బాలు అని ఆనాడే ఘంటసాలవారు సెలవిచ్చారు.
భారత ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ఓ తపాలా బిళ్లను ముద్రించింది. ఇది ఏ సినిమా గాయకునికి అందని అరుదైన గౌరవంగా సావిత్రి వివరిస్తారు. ఘంటసాల తదనంతరం చిన్నపిల్లలతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ, ఆమె తర్వాత ఓటమి అంగీకరించరాదని వారి పాటలతోనే స్ఫూర్తి పొందారు. అప్పటికి ఎన్ని ఇబ్బందులు వున్నా, ఎవరినీ చేయిచాచి అడగని మహా వ్యక్తిత్వం ఆమె సొంతం. అనేకమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు ఆయన వున్నప్పుడు నిత్యం ఇంటికి వస్తూనే వుండేవారు. వారందరికీ తాను అతిథి సత్కారాలు చేయడం అదృష్టంగా భావిస్తారామె. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారని, ఘంటసాల మాస్టారును జైలులో పెట్టారు. ఆయన తదనంతరం భారత ప్రభుత్వం స్వతంత్ర వీరులకు ఇచ్చే సదుపాయాలన్నీ సావిత్రమ్మకు కలగజేసింది. ఆయన పాటలనే స్మరించుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసారు. కష్టసమయంలో ఎవరూ ఆదుకోకపోయినా, అభిమానుల అండతో జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా ఈదుకొచ్చారు. అవసరాలకు మద్రాసులోని ఇల్లు అమ్మితే అభిమానుల్లో ఓ వ్యక్తి ఐదు లక్షలు ఇచ్చి మళ్లీ ఆ ఇల్లువెనక్కి ఇప్పిస్తానన్నా ఆమె వారించారు. తనతోపాటు ఎంతమంది గాయకులున్నా, వారికి మంచి అవకాశాలు రావాలని అభిలషించేవారు ఘంటసాల. ఆ కోరికను అలాగే సావిత్రమ్మ కూడా కొనసాగించారు. నూతన గాయకులు ఘంటసాలను దైవంగా భావించి, ఇప్పుడు అనేకమంది రియాల్టీ షోలలో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. వారందరికీ తన ఆశీస్సులు అందిస్తున్నారు.
ఘంటసాల అభిమానులు అనేక పట్టణాలలో గానసభలు ఏర్పాటుచేసి పాటలను వినిపిస్తున్నారు. దానికి వెన్నుదన్నుగా ఆమె ప్రోత్సాహం అందిస్తున్నారు. ఓ మహామనిషిలో అర్ధ్భాగాన్ని పాఠకులకు పరిచయం చేయడంలో ఈ గ్రంథం తనవంతు ప్రయత్నాన్ని చేస్తుంది. ముఖ్యంగా రచయిత ఘంటసాల అభిమాని కావడంతోఈ గ్రంథానికి తావి అబ్బి, గంధర్వలోక పారిజాత పరిమళం అబ్బింది. ఇప్పటివరకు ఘంటసాల పేరుతో ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాలు జరిగాయి, కళాపీఠాలు స్థాపించి ఎవరెవరు ఆయన బాటలో సాగుతున్నారు తదితర విషయాలు ఆహ్వాన పత్రాలతో సహా ముద్రించారు. అక్కడక్కడ విషయానికి తగ్గట్టు అరుదైన మంచి ఫొటోలు అందించారు. పుస్తకంలోని కాగితం క్వాలిటీ బాగుండి రచయిత శైలి చదివింపచేస్తుంది. అన్నింటితోపాటు సావిత్రమ్మగారి స్వగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఘంటసాల అభిమానులందరూ చదవదగ్గ పుస్తకం ఇది. తన భార్య దృష్టిలో ఆ అమరగాయకుని మూర్తిత్వాన్ని దర్శింపచేస్తూ సాగిన ఈ రచన, సినీ ప్రియకులకు అలనాటి విశేషాలను అందిస్తుంది.

3 comments:

sowmya said...

WOW, ఒక ప్రముఖుని భార్యమీద పుస్తకం రావడం నిజంగా గొప్ప విషయం!

భావన said...

యస్... నిజంగా గొప్ప విషయం ఆమె మీద పస్తకం రావటమ్. that's so nice to hear.

హారం ప్రచారకులు said...

విహారి(KBL) గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.