Monday, September 24, 2012

మహానంది ఫొటోలు, విశేషాలు

పరమశివుడు మహానందీశ్వరుడుగా కొలువై ఉన్న క్షేత్రం మహానంది. ఇది నంద్యాల పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉంది.

ఇదే మహానంది ముఖద్వారం. ఇక్కడ శివున్ని మనం స్పర్శ దర్శనం ద్వారా తాకి పూజించవచ్చు. కాని దీనికి ప్రత్యేక రశీదు తీసుకోవాలి. స్పర్శ దర్శనం చేసుకొవాలంటే మగవారు చొక్కా లేకుండా గర్భగుడిలోనికి ప్రవేశించాలి.
ఈ శివలింగం కిందనుంచి నిరంతరం జలం నీళ్ళు ఉధ్భవిస్తుంటాయి. ఈ నీరు బయట ఉన్న ప్రధాన కోనేరు లోనికి వస్తాయి. ఈ ప్రధాన కోనేరులోని నీరు చాలా స్వచ్చంగా ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

కాని ఇందులోకి కొన్ని వేళల్లో మాత్రమే అనుమతిస్తారు.కాని ఆలయ మండపం బయట మరో రెండు కొనేర్లు ఉన్నాయి. ప్రధాన కోనేరులోని నీరు ఈ రెండు కొనేరులలోనికి వస్తుంది. ఈ రెంటిలో అన్ని వేళలా భక్తులకు స్నానానికి అనుమతి ఉంది.

ఈ రెండు కొనేరులలోని నీరు తరువాత చుట్టుపక్కల పంటపొలాలకి ప్రవహిస్తుంది. అందుకే మహానంది చుట్టుపక్కల పచ్చని పంటపొలాలతో, అరటి తోటలతో చాలా పచ్చగా ఉంటుంది. ఇక్కడ మహానందితో పాటు మరో ఎనిమిది గుడులు ఉన్నాయి. వీటినన్నిటి కలిపి నవనంది క్షేత్రాలు అంటాలు. ఇవన్ని మహానంది చుట్టుపక్కలే ఉంటాయి. ఒక పూటలో అవన్ని చుట్టి రావచ్చు. వాటిలో ఒకటైన వినాయకనంది మహానంది ఆలయం ప్రాంగణంలొనే ఉంటుంది.



ఇక్కడ వసతి సదుపాయానికి సత్రాలు ఉన్నాయి. లేదంటే నంద్యాలలో స్టే చెయ్యొచ్చు.

No comments: