
అందరికి నమస్కారం.చెట్టినాడు స్పెషల్ విందు ఆరగించేముందు ఒక విషయం. నాకు ఉద్యొగం వచ్చింది.కనుక ఇంక అంత ఎక్కువగా టపాలు వెయలేకపొవచ్చు.కాని సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తాను.రెండు బ్లాగులు మెయింటైన్ చెయ్యాలి.చాలా కష్టమయిన పని అయినా ఇష్టంగా చెయ్యలనుకుంటున్నాను.ఇక ఇది ఆపి చెట్టినాడు స్పెషల్ విందు ఆరగించండి.
చెట్టినాడు తమిళనాడులోని ఒక ప్రాంతం.ఆ ప్రాంతానికి ఆ పేరు రావటనికి కారణం నట్టుకొట్టై చెట్టియార్స్.ఆ కులం వాళ్ళు ఎక్కువగా వుండే ప్రాంతం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.మొదట్లో 96 గ్రామాలు కలిసి చెట్టినాడు ప్రాంతంగా పిలిచేవారు.ఇప్పుడు చాలా మంది వలస వెళ్ళిపోవతంవల్ల ఆ గ్రామలు 75 కి తగ్గిపొయాయి.ముఖ్యముగా చెట్టినాడు అంటే "కారైకూడి","దేవకొట్టై"; పరిసరప్రాంతాలు కలిపి పిలుస్తారు.
ఎంటి ఆ చెట్టియారుల సంగతి అంటే వాళ్ళు చాల ధనవంతులు.వాళ్ళు డబ్బులు అప్పులు ఇవ్వటం,వసూల్ చేయటం అది పని.ఇప్పుడు వున్న బాంక్ లావాదేవీలు,వాళ్ళు ఆ కాలంలోనే మొదలుపెట్టారు.ఇప్పటి చిట్ ఫండ్ కంపనీలకి వాళ్ళే ఆద్యులు.1875నుంచి 1925 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్థని వీళ్ళే శాసించారు.తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది అనేక ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వలస వెళితే అక్కడ కుమారస్వామి గుళ్ళు కట్టించేవారు.అందుకే మీకు బర్మా,మలేషియా,శ్రీలంక,థాయిలాండ్ లాంటి చోట్ల ఆ గుడులుకనిపిస్తాయి. మనుషులు చూడటానికి సౌమ్యంగా వుండి వీళ్ళా ఇంత లావాదేవిలు నడిపేది అనిపిస్తుంది.

శివున్ని,కుమారస్వామిని ఎక్కువగా కొలిచేవారు.ఇంటిపెద్ద అన్ని లావాదేవీలు చూస్తే ఇంటావిడ అందరికి వండివార్చేది.ఇళ్ళు అంటే గుర్తుకొచ్చింది అసలు స్పెషలే అది.వాళ్ళ ఇళ్ళ డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే.ఒక వీధిలో సిం హద్వారం వుంటే ఇంకో వీధిలో వెనకద్వారం వుంటుంది.రెండు వీధుల మధ్య వున్న ఆ విశాలమైన ఇంటిలో ఎంతో ఎత్తున నిర్మించిన పైకప్పు,ప్రతేక్య పూత పూయబడిన గోడలవల్ల మండువేసవిలోనూ చల్లగా,ధారాళంగా గాలివీస్తూ సౌకర్యంగా వుంటాయి.
ఇంటి నిర్మాణంలో వాడిన రంగూన్ టేకు,రాజస్థాని చలువరాయి ఇంటికి మరింత అందాలను తెచ్చి మనల్ని ఆకట్టుకుంటాయి.సిం హద్వారానికి వుండే నగిషి ఆ చెట్టిగారి సంపదను తెలయచేస్తుంది.ద్వారానికి అటు,ఇటు అరుగులు,ఒకవైపు ధాన్యాగారాలు,మరోవైపు సామాను భధ్రపరిచే గదులు,మధ్యలో విశాలమైన మండువా.మొదటి మండువా దాటి వెళిటే రెండొవ మండువా,మూడవ మండువా.రెండువ మండువా చుట్టూ పడక గదులుంటాయి.ఇంటిలో ఒక పెద్ద భొషాణం లాంటి పెట్టి వుంటుంది ఇందులోనే వడ్డిలకు తిరిగే డబ్బు దాచేవారు.జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సాంబ సినిమాలో ఈ ఇళ్ళు చూడొచ్చు.నేను పుదుక్కొట్టైలో చదివేటప్పుడు ఆ సినిమా షూటింగ్ జరిగితే అందరు వెళ్ళాము.
ఇక ఇంటి అందాలు చూడండి.



ఇక ఇంకో స్పెషల్ చెట్టినాడు ఫుడ్.అక్కడ వుండే వయసులో పెద్దవాళ్ళైన ఆడవాళ్ళని "ఆచి" అంటారు.వాళ్ళు కొన్ని ప్రతేకమైన మషాలాలు దట్టించి వండే వంటలు అమోఘం.ఆవంటలనే చెన్నైలోనే కాక విదేశాలలోని తమిళులు హోటల్స్లో చెట్టినాడు స్పెషల్ అని చెప్పి అందిస్తారు.కాని అందరు ఆ రుచి అందించలేరు.చెట్టినాడు చికెన్ కర్రి తయార్.ఆరగించండి.

ఇక ఇంకో స్పెషల్ చూడండి.ఇది చెట్టినాడు మహిళల సాంప్రదాయ తాళి .ఇది చాల బరువు వుంటుంది.ఎలా మోస్తారోగాని ఇప్పటికి ఇలాంటివే వాడతారు.దీని ధర లక్షనుంచి లక్ష్న్నర వరకు వుంటుంది.

ఇన్ని ప్రతేకతలు వున్న ఆ ప్రాంతం ఒక పర్యాటకప్రదేశం గా మారకుండా వుంటుందా.ఎలా వుందండి చెట్టినాడు స్పెషల్ .అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను.నచ్చితే చెప్పండి.ధన్యవాదాలు.