
నేను చెప్పబోయేది తమిళ చిత్రం మైనా గురించి. మీకు తమిళ్ వచ్చినా రాకపోయినా తప్పకుండా చూడవలిసిన సినిమా మైనా. మొన్న దీపావళికి విడుదలైంది ఈ సినిమా. మంచి సినిమా చూడాలనుకొనేవారెవ్వరు మిస్ అవ్వకూడని సినిమా. అంతా కొత్త తారలతో ఒక హృద్యమైన ప్రేమ కావ్యంలా ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక కథ విషయానికొస్తే అందమైన కొండప్రాంతంలో పెరిగిన హీరో హీరోయిన్ల ప్రేమకథ ఏ ఏ మలుపులు తిరిగి ఎలా ముగిసింది అనేది. సినిమా అంతా ఒక రకమైన ఉత్కంఠతతో, ఒక తీయని భావనతో సాగుతూ చివరికి మనసును మెలిపెట్టేస్తుంది.ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కాకుండా మిగిలిన కథంతా ఒక్కరొజులో జరిగిన సంఘటనలతో కూడుకొని ఉంటుంది. ఒక్కరోజులో ఎవరి జీవితాలు ఎలా మారాయి అనేది ఆసక్తికరంగా చిత్రీకరించాడు దర్శకుడు ప్రభుసాల్మన్. తమిళనాట విజయదుంధుభి మ్రోగించిన ఈ సినిమా తెలుగులో డబ్ అవుతుందో లేదో చూడాలి.
అంతా కొత్తవారైనా చాలా బాగా చేశారు. ముఖ్యంగా "తేని" ప్రాంతం అందాలు చాలా బాగున్నాయి. సినిమా చూసాకా కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. మొత్తం పది భాగాలు. వరసగా చూడొచ్చు. మీరు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే ఈ కింద లింకులో మొదటి భాగం చూడొచ్చు. మిగతా భాగాలు ఆ పక్కనే ఉంటాయి.
http://www.youtube.com/watch?v=eYMR3eNJ6-E&feature=related
మీకూ ఈ సినిమా నచ్చితే ఒక కమెంటు పడేయండి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
1 comment:
English comments unte bagundedi....Started watching but tamil radhu ...
Post a Comment