Thursday, January 26, 2012

శ్రీముఖలింగం చూసొద్దాం

శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలోని ఒక గ్రామము. ఇది శ్రీకాకుళం పట్టణానికి 45 కి.మీ దూరంలో ఉంది. పురాతనమైన ఈ ఆలయాన్ని ఒరిస్సా రాజులు కట్టించటం వల్ల ఈ గుడి చూడటానికి ఒడిసా స్టైల్లో చాలా అందంగా ఉంటుంది.



ఇక్కడ బస చేయటానికి ఉండదు. ఈ గుడి చూడాలనుకుంటే శ్రీకాకుళం పట్టణంలో బస చేయాలి.ఇక్కడికి వెళ్ళటానికి శ్రీకాకుళం బస్‌స్టాండ్ నుంచి ప్రతి 45 నిమషాలకి ఒక బస్సు ఉంది.

గుడిలో శివలింగం ముఖాకృతిలో ఉండటం వల్ల ఈ లింగానికి శ్రీముఖలింగం పేరు వచ్చింది. లింగంలో పొడవైన ముక్కుని మనం చూడవచ్చు. మధ్యలో ప్రధన ఆలయం, చుట్టూ ఇతర ఆలయాలు ఉంటాయి.

మారుమూల అవ్వటం వల్ల పెద్దగా జనాదరణ లేక ప్రసిద్ది చెందలేదనిపిస్తుంది. అద్భుతమైన శిల్పకళ ఉన్న ఈ ఆలయన్ని ప్రతి ఒక్కరు తప్పక దర్శించాలి. మీరు శ్రీకాకుళం వెళితే మాత్రం ఈ గుడిని తప్పక దర్శించుకోండి. శ్రీకాకుళం పట్టణానికి దగ్గరలోనే అంటే 3 కి.మీ దూరంలో అరసవిల్లి మరియు 15 కి.మీ దూరంలో శ్రీకూర్మం క్షేత్రాలు ఉన్నాయి.


ప్రధాన ఆలయం








ప్రధాన ఆలయంలోని ఉపాలయం


ప్రధాన ఆలయ ముఖద్వారం



ఆలయంలోని శిల్పకళ







సాయంసంధ్యలో ఆలయం

2 comments:

రాహుల్ said...

ధన్యవాదాలండి..
చాలా మంచి సమాచారమిచ్చారు.

సిరి శ్రీనివాస్ said...

తెలియని ఆలయాన్ని చక్కగా తెలియ చేశారు. నా శ్రీకాకుళం యాత్రలో చేర్చేస్త్తాను.